Raja Saab: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. ఈ సినిమా ఈ ఏడాది ఆఖరిలో డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయినా అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
తరచూ ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేమిటంటే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్ తో కలిసి చిందులు వేయబోతోందట. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు తమన్నా. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది తమన్నా. వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీబిజీగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అయినా కూడా ఇప్పటికీ అదే ఊపుతో అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతోంది.
వయసుతో పాటు ఈమె అందం కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం తమన్నా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఐటమ్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దాదాపుగా 10 కి పైగా స్పెషల్ సాంగ్స్ లో చేసింది. జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా అనే సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే. అలాగే 2024లో స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ సాంగ్ లో తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేసింది. అయితే తాజాగా తమన్నా మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ది రాజా సాబ్. ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో కలిసి తమన్నా డ్యాన్స్ చేయనున్నారట. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
