The Raja Saab: ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ స్పెషల్ సాంగ్.. భారం అంతా తమన్ పైనే?

The Raja Saab: టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం చేతిలో బోలెడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్. తక్కువలో తక్కువ ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు ఇంకా కొత్త కొత్త సినిమాలకు కమిట్ అవుతూనే ఉన్నారు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా విడుదల చేయాలని భావిస్తూ ఇప్పటికీ డేట్ ని అధికారికంగా కూడా ప్రకటించేశారు. రొమాంటిక్ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇకపోతే ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. హారర్‌, కామెడీతో పాటు విజువల్స్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరో హీరోయిన్ తో కలిసి ఒక సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

అంటే ఒక ఫుల్ సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ తో కలిసి చిందులు వేయనున్నారట. అయితే ‍ప్రభాస్ ఫ్యాన్స్‌ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఒక స్పెషల్ సాంగ్‌ ను మారుతి ప్లాన్ చేసినట్లు చేస్తోంది. ఒక ఫుల్ మాస్‌ సాంగ్‌ ను తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారట. దీనికోసం ఒక హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారు. అయితే ఆ సాంగ్ ‍మ్యూజిక్‌ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ ది రాజాసాబ్‌ టీమ్‌ను దాదాపు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఆలోచనలో పడిన మూవీ మేకర్స్ ఎలాగో ఈ సినిమాకు మ్యూజిక్ ని అందిస్తున్న బీజీఎం కింగ్ ఎస్ఎస్‌ తమన్‌ తోనే ఒక ప్రత్యేక సాంగ్‌ ను కంపోజ్‌ చేయనున్నారట. ముగ్గురు హీరోయిన్లతో చేసే పాటకు తమన్‌ ఒక రేంజ్‌ లో అదిరిపోయే సంగీతం కొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ది రాజాసాబ్‌ టీమ్‌ కు కూడా దాదాపు రూ.5 కోట్ల రూపాయలు సేవ్‌ అయినట్లే అని చెప్పవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్‌ కోసం తమన్‌ ఎలాంటి బీట్స్‌ అందిస్తాడో వేచి చూడాల్సిందే. ఎందుకంటే స్పెషల్ సాంగ్స్ కంపోజ్‌ చేయడంలో తమన్‌ హై టాలెంటెడ్ అని మనందరికీ తెలిసిందే. కాగా ది రాజాసాబ్‌ షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందట.