రామా జానకిని దూరం పెట్టిన కుటుంబ సభ్యులు…. స్వీట్ షాప్ తాకట్టు పెట్టబోతున్న రామ!

జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…రామ ఇంట్లో ఎవరికి తెలియకుండా 20 లక్షలు అప్పు చేయడంతో అందరూ తనని అపార్థం చేసుకుంటారు చివరికి తన తల్లి జ్ఞానంబ కూడా తనని అపార్థం చేసుకుంటుంది.ఇవన్నీ రామా తెలివితేటల లేక ఇంకొకరి తెలివితేటల అర్థం కాలేదని బాధపడుతుంది అయితే తను మాత్రం నా రామా కాదు అంటూ బాధపడుతుంది.

నీ మీద నాకు ఉన్నది కోపం కాదు మూడు రోజుల్లో 20 లక్షల డబ్బు కట్టకపోతే ఈ కుటుంబం ఏమవుతుందో నన్న బాధ అని జ్ఞానాంబ చెప్పడంతో మిమ్మల్ని తలదించుకునే పరిస్థితికి తీసుకురాను అని రామా చెపుతాడు మూడు రోజులలో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలవు అని జ్ఞానాంబ ప్రశ్నిస్తుంది. ఇలా జ్ఞానాంబ రామాను తిట్టడం చూసిన మల్లికా సంతోష పడుతూ లోపలికి వెళ్తుంది అదే సమయంలో విష్ణు ఆలోచిస్తూ కూర్చోవడంతో మనం ఇలాగే ఉంటే మనకంటూ ఏమీ ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది వెంటనే మనం వేరుగా వెళ్ళిపోదామని చెప్పడంతో విష్ణు కూడా మీ ఆలోచన కరెక్టే కానీ ఇలాంటి సమయంలో కుటుంబాన్ని వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని ఆలోచిస్తాడు.

మరోవైపు గోవిందరాజులు రామని తప్పుగా అర్థం చేసుకోకు మనకు తెలియకుండా అతను అంత డబ్బు అప్పు చేశాడు అంటే ఒకసారి తన వైపు నుంచి కూడా ఆలోచించు అని గోవిందరాజులు చెప్పినప్పటికీ జ్ఞానం మాత్రం తన భార్యకు చెప్పాలని అనిపించింది కానీ మనకు చెప్పాలని అనిపించలేదు ఈ విషయంలో వాడు మనల్ని మోసం చేసినట్టు కాదా అని జ్ఞానాంబ మాట్లాడుతుంది. మరోవైపు తన తల్లి మాటలను తలుచుకొని రామ బాధపడుతూ ఉండగా జానకి వెళ్లి తనని ఓదారుస్తుంది.ఇక జ్ఞానం గోవిందరాజుల కోసం వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది అయితే అప్పటికే చికిత జానకమ్మ గారు వంట చేశారని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఇది మా కోసం చేసుకుంటున్న వంట అనే జ్ఞానంబ వంట చేస్తుంది.

ఇలా జ్ఞానంబ వేరుగా వంట చేసుకుని తన భర్తకు తీసుకెళ్లడంతో జానకి చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటుంది.దీంతో జానకిరామ ఎలాగైనా ఈ అప్పు తీర్చి అందరిని కాపాడాలి అంటూ ఉండగా రామ అందుకు మరో మార్గం లేదు నా స్వీట్ షాప్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటానని జానకితో చెబుతాడు.మరి ఈ విషయం అత్తయ్యకు చెప్పారా అని జానకి అడగడంతో రామ స్వీట్ షాప్ కాగితాలు తీసుకొని జ్ఞానాంభ వద్దకు వెళ్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.