బిగ్ హ‌స్‌లో ఆ స్పెషల్ ప్లేస్ ఆమెదేనా.?

The Bigg Special Quota For Her | Telugu Rajyam

బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ఓ ప్యాటర్న్‌తో నడుస్తోంది. గత సీజన్లలో ఆయా కంటెస్టెంట్ల బిహేవియర్, ఆటిట్యూడ్స్ తదుపరి సీజన్లలోనూ కంటిన్యూ అయ్యేలా ఆయా క్యారెక్టర్స డిజైనింగ్ ఉంటోందని వీక్షకులు భావిస్తున్నారు. అయితే, అదేం కాదు, ఎప్పటికప్పుడు బిగ్‌బాస్ ఫ్రెష్ అప్పీల్‌తో ఫ్రెష్ ఫ్యాటర్న్‌తో డిజైన్ చేయబడుతుదంటూ, బిగ్‌బాస్ నిర్వాహకులు చెబుతూ ఉంటారనుకోండి.

అసలు విషయానికి వస్తే, బిగ్‌బాస్ లేటెస్ట్ సీజన్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన హమీదాని గత సీజన్‌లో మోనాల్ గజ్జర్‌తో పోల్చి చూస్తున్నారు వీక్షకులు. గతంలో మోనాల్ గజ్జర్ పట్ల ఎందుకో తెలీదు కానీ, నాగార్జునకు స్పెషల్ కేరింగ్ ఉండేది. హౌస్‌లో ఆమె పీకేది ఏం లేకపోయినా, నిర్వాహకులు కూడా ఎలిమినేట్ చేయకుండా, సేవ్ చేస్తూనే వచ్చారామెను.

అలా ఇప్పుడు హమీదాను స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారనే అనుమానాలొస్తున్నాయి. నాగార్జునగారూ మీ షర్టు నాకు చాలా బాగా నచ్చింది.. అది నాకు కావాలి.. అంటూ నాగార్జునకు బిస్కెట్ వేసి, ఆ షర్టును గిఫ్ట్‌గా కొట్టేసింది హమీదా.

అంతేకాదు, చాలా క్యూట్‌గా ఉన్నావమ్మా.. మంచిగా డాన్స్ చేశావమ్మా.. అంటూ నాగ్ కూడా హమీదాపై ప్రశంసల జల్లు కురిపిస్తుండడం మరింత బలాన్ని చేకూరుస్తుంది నెటిజన్లకు. అయితే, మరీ మోనాల్ టైపు కాదు, ఆమెతో పోల్చితే హమీదా కాస్త బెటరే.. అని ఓ వర్గం నెటిజన్లు కితాబిస్తున్నారు హమీదాకు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles