హైపర్ ఆది ప్రవర్తన పై మండిపడ్డ ప్రేక్షకులు.. ఆడవారు అంటే చులకన అంటూ..?

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి మనందరికీ తెలిసిందే. పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై పంచులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు. అయితే కొన్ని కొన్ని సార్లు హైపర్ ఆది కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే విధంగా పంచులు వేస్తూ ఉంటాడు. ఇప్పటికే పలుసార్లు హైపర్ ఆది ఆ విధంగా పంచులు వేసి ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే హైపర్ ఆది కి అమ్మాయిలు కనిపించారు అంటే చాలు వారిపై సెటైర్లు వేయడం లేదంటే వారి వైపుకలాగా చూడటం లాంటివి చేస్తూ ఉంటాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది చేసె రచ్చ గురించి మనందరికీ తెలిసిందే.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమోలో అబ్బాయిలు అమ్మాయిలను ఎత్తుకొని మ్యూజికల్ చైర్స్ ఆట ఆడాలి. ఈ ఆట ఆడుతున్నప్పుడు హైపర్ ఆది మరింత రెచ్చిపోతూ ప్రతివారం ఇలాంటి ఆట ఒకటి ఉంటే బాగుంటుంది అంటూ అమ్మాయిలను కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడు. కాగా ఆ మాటపై ప్రేక్షకులు హైపర్ ఆది పై మండిపడుతున్నారు. ఆడవాళ్లు అంటే హైపర్ ఆదికి అంత చులకననా.. గతంలో కూడా ఈ విధంగా ఆడవారిపై ఇలాంటి చెత్త కామెంట్లు చేశాడు అంటూ నెటిజెన్స్ హైపర్ ఆది పై మండిపడుతున్నారు.

కామెడీ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడినా కూడా నడిచిపోతుంది అని హైపర్ ఆది భావిస్తున్నాడేమో అంటూ అది పై మండిపడుతున్నారు. ఇలా ప్రతిసారి మహిళలను కించపరిచే విధంగా కామెంట్లు చేస్తున్న హైపర్ ఆది ముందు ముందు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని పలువురిని నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా షోలో సారంగా మాట్లాడుతూ సీనియర్లు అన్న గౌరవం లేకుండా వారిపై పంచులు వేయడం అలాగే అన్నపూర్ణమ్మ, మలక్ పేట శైలజ సీనియర్లను ఏకవచనంతో పిలుస్తూ వారిని అవమానించే విధంగా మాట్లాడడం లాంటివి చేస్తున్నాడు అంటూ హైపర్ ఆది పై మండి పడుతున్నారు. అయితే హైపర్ ఆది చాలా వరకు ఆడవారిపైనే వేసే పంతులు సక్సెస్ అవుతుండడంతో అదే కంటిన్యూ చేస్తూ ఒక్కోసారి మితిమీరి మరి ఆడవారిపై పంచులు వేస్తూ ఉంటాడు. ఇది ఏమైనాప్పటికీ హైపర్ ఆది ఆడవారి పట్ల ప్రవర్తించిన తీరు బాగోలేదు అని నెటిజన్స్ మండి పడుతున్నారు.