హేమ వయసు గురించి మాట్లాడుతూ ఆమె పరువు తీసిన ఆది.. భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్?

హైపర్ ఆది బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయన కామెడీ టైమింగ్ ఈయన వేసే పంచ్ డైలాగులకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఇక అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ మంచి గుర్తింపు సంపాదించుకోవాలనుకున్న వారు హైపర్ ఆది చేత పెద్ద ఎత్తున పంచులు వేయించుకుంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.అయితే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది ఏ కార్యక్రమానికి వెళ్లిన ఆ కార్యక్రమానికి గెస్ట్లుగా వచ్చినటువంటి సీనియర్ సెలబ్రిటీలను సైతం ఏమాత్రం వదలకుండా వారిపై దారుణమైన పంచ్ డైలాగులు వేస్తూ వారి పరువు మొత్తం తీస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది నేటిజన్స్ హైపర్ ఆది వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు.హైపర్ ఆది నోటికి అడ్డు అదుపు లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ అందరిని అవమానిస్తున్నారు అంటూ కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే రోజా, సింగర్ మనో, ఇంద్రజ, కృష్ణ భగవాన్ వంటి వారిపై ఈయన తన పంచ్ డైలాగులు వేసి అవమానపరిచిన విషయం మనకు తెలిసిందే. తాజాగా మంగమ్మగారి కొడుకు అనే కాన్సెప్ట్ ద్వారా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి నటి హేమ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

హేమ కుమారుడిగా పొట్టి నరేష్ ను చూపించారు. చిన్న తండ్రి ఇటు చూడరా పొట్టి నరేష్ వింత గెటప్ లో ఎంట్రీ ఇవ్వగా వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ ఏంట్రా మీ అమ్మకు 70 ఏళ్ళు వచ్చిన ఇంకా గౌన్లు వేసుకోవడం మానలేదు అంటూ కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా నరేష్ తలదించుకోగా హేమ షాక్ అవుతుంది.ఇంతటితో ఈ ప్రోమో కట్ చేశారు. అయితే హైపర్ ఆది ఇలా హేమా అని తన వయసు గురించి మాట్లాడటమే కాకుండా తన వస్త్రధారణ గురించి కూడా మాట్లాడుతూ పంచ్ డైలాగ్ వేయడంతో నేటిజన్ లు భారీగా హైపర్ ఆదిని ట్రోల్ చేస్తున్నారు.