బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుదీర్ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు.ఎప్పుడైతే ఈయన మల్లెమాల వారి కార్యక్రమాల నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి బుల్లితెరపై సుదీర్ సందడి తక్కువ అయిందని చెప్పాలి. మల్లెమాల వారి కార్యక్రమాల నుంచి తప్పకున్న సుధీర్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో ఈయన ఏ కార్యక్రమాలలో కనిపించలేదు.
అయితే ఇలా సుధీర్ బుల్లితెరకు దూరంగా ఉండడానికి గల కారణం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.జబర్దస్త్ నుంచి సుధీర్ బయటకు రావడంతో ఈయనకు ఎక్కడ అవకాశాలు లేక దూరంగా ఉన్నారని కొందరు భావించగా మరి కొందరు మాత్రం సుధీర్ వింత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తద్వారా ఈయన ఏ కార్యక్రమాలలోనూ పాల్గొనలేకపోతున్నారంటూ వార్తలు సృష్టిస్తున్నారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇకపోతే సుధీర్ ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడలేదు అయితే కొందరు ఉద్దేశ పూర్వకంగానే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ సుధీర్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇప్పటికే తన సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలిసి ఉండేదని కొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. అయితే ఈయన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలకు చెక్ పెట్టాలి అంటే ఈ వార్తలపై సుధీర్ స్పందించాల్సి ఉంది.