వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయనున్న సుడిగాలి సుదీర్… సంతోషంలో అభిమానులు!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. మెజీషియన్ గా తన జీవితాన్ని ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ కామెడీ షోలో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో స్క్రిప్ట్ రైటర్ గా మారి టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. టీం లీడర్ గా మారిన తర్వాత గెటప్ శ్రీను, అదిరే అభి తో కలిసి అద్భుతమైన స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నెంబర్ వన్ టీం లీడర్ గా గుర్తింపు పొందాడు.

ఇలా జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతోపాటు ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇలా కమెడియన్ పాపులర్ అయిన సుధీర్ సినిమాలలో హీరోగా నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఇప్పటికే సాఫ్ట్వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడు వంటి సినిమాలలో నటించాడు. ఇక ప్రస్తుతం సుధీర్ హీరోగా నటించిన గాల్లోడు సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్.. సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తన జీవిత లక్ష్యం గురించి చెప్పుకొచ్చాడు . ఇప్పటివరకు తనకి వచ్చిన పేరు ప్రతిష్టలు చాలని…. ఇక ఇప్పుడు తిరిగి ఇచ్చే సమయం వచ్చిందని అన్నాడు. ఈ క్రమంలో ఓ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని.. అందుకు సంబంధించిన పనులు ఎప్పుడో ప్రారంభించేశానని తెలిపాడు సుధీర్. చిరంజీవి, రజినీకాంత్,పవన్ కల్యాణ్ లు తనకు స్ఫూర్తి అని …వారందరూ ఎంత ఎత్తు ఎదిగితే అంత ఒదిగి ఉండి సమాజానికి సేవ చేస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలని సుధీర్ చెప్పకొచ్చాడు. ఇలా ఈ క్రమంలోనే ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయటానికి పనులు ప్రారంభించినట్లు వెల్లడించాడు. సుధీర్ మంచి మనసు గురించి తెలుసుకున్న అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.