ఈటీవీలో సుడిగాలి సుదీర్ రీ ఎంట్రీ..ఆనందంలో అభిమానులు!

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా ఫేమస్ అయిన సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ లో అవకాశం అందుకొని టీం లీడర్ గా మంచి గుర్తింపు పొందాడు. అంతేకాకుండా జబర్దస్త్ యాంకర్ రష్మీతో సుధీర్ నడిపిన ప్రేమాయణం వల్ల మరింత పాపులర్ అయ్యాడు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన సుధీర్ కి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించే అవకాశాలు వస్తున్నాయి. అందువల్ల సుధీర్ కొంతకాలం ఈటీవీకి విరామం ఇచ్చి మాటీవీలో ప్రసారమవుతున్న షోలలో యాంకర్ గా వ్యవహరించాడు . దీంతో సుధీర్ ఇక ఈటీవీలో అడుగుపెట్టే అవకాశాలు లేవని అందరూ భావించారు.

కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ జబర్దస్త్ లో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానని వెల్లడించాడు. కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే జబర్దస్త్ కి కొంచెం గ్యాప్ ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో సుధీర్ సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ లో సుధీర్ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంది. వచ్చి రావటంతోనే పెద్ద డైలాగ్ చెబుతూ..తన సిగ్నేచర్ ఫోజు ఇస్తూ సందడి చేశారు. ఇక గతంలో రష్మి, సుధీర్ ఇద్దరు యాంకరింగ్ చేసేవారు. ఇక ఇప్పుడు సుధీర్ రే ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తూ సందడి చేయబోతున్నారు.

ఇక సుధీర్ రష్మి జంటకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఈ వారం ప్రసారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో సుధీర్ రష్మీ ఇద్దరు కలిసి జంటగా యాంకరింగ్ చేస్తూ సందడి చేయనున్నారు. ఇక సుధీర్ ఈ షోలో రీయంట్రి ఇచ్చిన తర్వాత రష్మితో కలిసి రొమాన్స్ మొదలుపెట్టాడు. అంతేకాకుండా రాంప్రసాద్ తో కలిసి ఒక స్కిట్ కూడా చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలాకాలంగా సుధీర్ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు కూడా సుధీర్ రాకతో ఫుల్ ఖుషి అయ్యారు. ఇకపై ఇద్దరూ ఇలాగే జంటగా కలిసి షో చేయాలని సుధీర్ అభిమానులు ఆశపడుతున్నారు.