జబర్దస్త్ కు రీ ఎంట్రీ ఇవ్వనున్న సుడిగాలి సుధీర్… ప్రోమోతో క్లారిటీ ఇచ్చిన ఆది?

జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ ఒకరు.ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వీరు ఇదే చానల్లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు.అయితే గత కొంతకాలం నుంచి హైపర్ ఆది సుడిగాలి సుదీర్ గెటప్ శీను వంటి వారు జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించలేదు.ఇకపోతే హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ సుధీర్ మాత్రం పూర్తిగా పక్క ఛానల్ కు వెళ్లి ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ ఇక ఈ కార్యక్రమాలకు తిరిగి రారని అందరు భావిస్తున్న నేపథ్యంలో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ద్వారా సుడిగాలి సుదీర్ తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా కొంతమంది నేటిజన్స్ ఈ వేదికపై సందడి చేశారు. ఈ క్రమంలోనే హైపర్ ఆదిను జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రశ్నించారు.అలాగే సుడిగాలి సుదీర్ రీ ఎంట్రీ ఇస్తారా అని ప్రశ్నించగా హైపర్ ఆది ఇందుకు సంబంధించి ఏదో సమాధానం చెప్పారు. అయితే ఆ సమాధానం మనకు వినపడకుండా బీప్ చేశారు.

ఈ విధంగా హైపర్ ఆది సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ గురించి ఏం చెప్పాడు సుధీర్ తిరిగి ఈ కార్యక్రమానికి వస్తారా తిరిగి రానున్నరన్న ఉద్దేశంతోనే ఈ ప్రోమోలో సుదీర్ ప్రస్తావన తీసుకువచ్చారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.అయితే సుడిగాలి సుదీర్ గురించి హైపర్ ఆది ఏం చెప్పారనే విషయం తెలియాలంటే ఆదివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.