ఈటీవీలో సుధీర్, చమ్మక్ చంద్ర రీ ఎంట్రీ… వైరల్ అవుతున్న వీడియో…!

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో సుధీర్ , చమ్మక్ చంద్ర వంటి ఎంతోమంది కమెడియన్లుగా ఎదిగారు. అయితే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వీరు వ్యక్తిగత కారణాలవల్ల జబర్దస్త్ కు దూరమయ్యారు. చమ్మక్ చంద్ర జబర్దస్త్ కు దూరమై చాలాకాలం అయ్యింది. జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన నాగబాబుకి మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్థల కారణంగా జబర్దస్త్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో చమ్మక్ చంద్ర కూడా నాగబాబు వెంటే జబర్దస్త్ నుండి బయటకు వెళ్ళాడు.

ఇలా జబర్దస్త్ కు దరమైనప్పటినుండి మాటీవీలో ప్రసారమవుతున్న పలు టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం సుడిగాలి సుదీర్ కూడా జబర్దస్త్ కి స్వస్తి చెప్పాడు. సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో సుదీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతున్నప్పటికీ.. సుధీర్ మాత్రం జబర్దస్త్ వదిలేసి మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో మల్లెమాల వారితో సుధీర్ కి ఉన్న గొడవల కారణంగా సుదీర్ బయటికి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక భవిష్యత్తులో సుధీర్ ఈటీవీలో కనిపించరని వార్తలు వినిపించాయి. కానీ ఈటీవీ ప్రారంభించి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్లెమాల వారు ఇటీవల భలే మంచి రోజు అంటూ ఒక స్పెషల్ ఈవెంట్ చేశారు. ఇటీవల ఈ ఈవెంట్ కి సంబంధించిన విడుదల అయింది. ఈ ఈవెంట్లో సుధీర్, చమ్మక్ చంద్ర పాల్గొని సందడి చేశారు. ఇలా జబర్థస్త్ కి దూరమై ఇక ఈటీవీ లో కనిపించడు అని అనుకున్న సుధీర్ ఇలా ఈ ఈవెంట్ లో పాల్గొనటంతో సుధీర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ సుధీర్ అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.