జబర్దస్త్ లో రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్..?

సుడిగాలి సుదీర్… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో సుడిగాలి సుధీర్ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. మెజీషియన్ గా తిప్పలు పడుతున్న సుధీర్ జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో టీం లీడర్ స్థాయికి ఎదిగి తన స్కిట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కమెడియన్ మంచి గుర్తింపు పొందాడు. ఇలా జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయిన సుధీర్ కి సినిమాలలో హీరోగా నటించే అవకాశాలు కూడా వచ్చాయి. మొదట “సాఫ్ట్ వేర్ సుధీర్” అనే సినిమా ద్వారా వెండితెరపై కనిపించిన సుధీర్ కి హీరోగా సరైన గుర్తింపు లభించలేదు.

అయినప్పటికీ వెండితెరపై తన సత్తా చాటుకోవాలని సుధీర్ ప్రయత్నాలు చేస్తూ.. గాల్లోడు సినిమా ద్వారా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇలా సినిమాలలో అవకాశాలు రావడంతో సుధీర్ జబర్దస్త్ కి దూరం అయ్యాడు. ఈ క్రమంలో మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలలో యాంకర్ గా ప్రత్యక్షమై ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. అయితే మా టీవీ లో ప్రసారమవుతున్న ఆ షోలు పూర్తి కావడంతో సుధీర్ చేతిలో ప్రస్తుతం ఒక టీవీ షో కూడా లేదు. ఈ క్రమంలో సుధీర్ మళ్లీ జబర్దస్త్ లో రీ యంట్రి ఇవ్వాలని అతని అభిమానులు ఆశపడుతున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ జబర్దస్త్ లో రీఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా.. జబర్దస్త్ అంటూ సుధీర్ సమాధానం చెప్పాడు . మరి అలాంటి జబర్థస్త్ ఎందుకు వదిలేశారు? అని మళ్లీ యాంకర్ ప్రశ్నించగా… సుధీర్ స్పందిస్తూ..” తాను షో వదిలేయలేదని.. కొంత గ్యాప్ ఇచ్చానని చెప్పారు. జబర్దస్త్ షోను నేను విడిచి పెట్టలేదు. ఒక 6 నెలలు బ్రేక్ తీసకున్నాను. ఆర్థిక సమస్యల కారణంగానే నేను జబర్థస్త్ లో గ్యాప్ తీసుకున్నాను. ఈ విషయాన్ని జబర్థస్త్ నిర్మాతలకు చెప్పగానే.. వారు కూడా ఓకే అన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తొందర్లోనే మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నానని క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ లో సుధీర్ రీఎంట్రీ ఇవ్వనున్నాడని తెలియగానే అతని అభిమానులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు.