బుల్లితెరపై కనుమరుగైన సుధీర్… ఆ చిన్న తప్పే సుధీర్ కెరీర్ ను నాశనం చేసిందా?

సుడిగాలి సుధీర్ … ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో లో పాల్గొనే అవకాశం దక్కించుకొని తనదైన శైలిలో పంచులు సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని కమీడియన్ గా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇలా ఈటీవీలో ప్రసారం అవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుధీర్ కి సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.

దీంతో సుధీర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా సినిమాలలో నటించాడు. ఇలా వరుస టీవీ షోలు సినిమాలతో బిజీగా ఉండే సుధీర్ కొన్ని కారణాలవల్ల ఈటీవీకి దూరమయ్యాడు. అయితే సుధీర్ ఇలా ఈటీవీకి దూరం కావటానికి ముఖ్య కారణం మా టీవీ వారు అత్యధిక రెమ్యూనరేషన్ ఆఫర్ చేయటం అని సమాచారం. మాటీవీలో ప్రసారమైన కామెడీ స్టార్స్, సూపర్ సింగర్స్ జూనియర్స్ అనే షోల కోసం సుధీర్ ని సంప్రదించి యాంకర్ గా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయటంతో సుధీర్ ఈటీవీ కి దూరమై మాటీవీలో ప్రసారమైన ఈ షోలలో సందడి చేశాడు. అయితే ఈ కామెడీ స్టార్స్ షో ని మూడు నెలల ముచ్చటగా కొంతకాలానికి మూసేశారు.

ఆ కామెడీ స్టార్స్ షో ప్రసారం నిలిపివేయటంతో సుధీర్ కి బుల్లితెర మీద అవకాశాలు లేక గత మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్నాడని సమాచారం. తిరిగి మల్లెమాల కి రావడానికి మొహం చెళ్ళక సుధీర్ పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. దీంతో ఇకపై సుధీర్ కి ఈటీవీలో కనిపించే అవకాశం లేదని ఇక తన కెరీర్ పడిపోవడం ఖాయమని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆహా వేదికగా ప్రసారం కానున్న ఒక కామెడీ షో లో సుధీర్ కీలక పాత్ర పోషించాడు. ఈ షో కోసం సుధీర్ ప్రస్తుతం సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.