యూట్యూబర్ పెళ్లికి కట్నాలు పంపిన సబ్ స్క్రైబర్స్.. మొత్తం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్…?

ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజుకి ఎక్కువగా పెరుగుతోంది. దీంతో యువతీ యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకొని ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా అనేకమంది ఫేమస్ అవ్వటమే కాకుండా అదికాదాయం కూడా పొందుతున్నారు. ఇలా యూట్యూబర్ గా ఫేమస్ అయిన శ్రీ కూడా పాపులర్ రావటమే కాకుండా నెల నెల అధిక మొత్తంలో ఆదాయం పొందుతున్నాడు. క్రియేటివ్ థింగ్స్ పేరిట షార్ట్ ఫిలిమ్స్, వీడియోస్, వ్లోగ్స్ చేస్తూ శ్రీ బాగా ఫేమస్ అయ్యాడు.

ఇలా యూట్యూబర్ గా ఫేమస్ అయిన శ్రీ ఇటీవల వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు. ఈ క్రమంలో తన పెళ్లికి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసి తమని ఆశీర్వదించమని వ్యువర్స్ ని కోరాడు. ఈ క్రమంలో సబ్‌స్క్రైబర్స్‌ నూతన దంపతులకు ఆశీర్వాదం తెలిపి.. కట్నాలు పంపించారు. ఇలా సబ్స్క్రైబ్ పంపిన మొత్తం కట్నాల విలువ నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఉండటం విశేషం. ఈ కట్నాల విషయాన్ని శ్రీ తన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. తమ పెళ్లి సందర్భంగా సబ్స్క్రైబ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు 23 వేల మందికి పైగా కట్నాలు పంపినట్లు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేశాడు.

అయితే.. ఇక్కడ 4 కోట్ల రూపాయల కట్నం అంటే.. నిజంగానే సబ్స్క్రైబర్స్ అందరూ తనకి డబ్బులు పంపించారని అపోహ పడకండి. ఆ యూట్యూబర్.. నా పెళ్ళికి మీరు పంపాలి అనుకున్న అమౌంట్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి చాలు. దాన్నే నేను డబ్బుగా భావిస్తాను అని చెప్పటంతో అతని అభిమానులందరూ కామెంట్ రూపంలో తాము సమర్పించాలనుకున్న డబ్బుని పంపించారు. ఇలా సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ల రూపంలో పంపించిన మొత్తాన్ని లెక్కచేయగా నాలుగు కోట్లకు పైగా తేలింది. అయితే ఇలా కట్నాలు సమర్పించిన సబ్స్క్రైబ్ కి సదరు యూట్యూబ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు పంపించిన కట్నం నాపై మీరు చూపించే ప్రేమకు నిదర్శనం అంటూ తెలియచేశాడు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.