బుల్లితెర మీద ప్రసారం అవుతున్న టీవీ షోలలో జబర్దస్త్ ఒకప్పుడు టాప్ రేటింగ్స్ తో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మాత్రం జబర్దస్త్ లోని ప్రముఖ కమెడియన్లందరూ జబర్దస్త్ నుండి బయటికి రావటంతో ఈ షో రేటింగ్స్ రోజురోజుకీ దారుణంగా పడిపోతున్నాయి. ఈ జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఎంతోమంది ఈ షో నుండి బయటకు వెళ్లిపోయారు. అలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. ఒక హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్న కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు. అయితే కొంతకాలం క్రితం నాగబాబుతో కలిసి ఆ షో నుండి బయటకు వచ్చాడు.
ప్రస్తుతం కిర్రాక్ ఆర్పీ మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల కిరాక్ ఆర్పీ లక్ష్మీ ప్రసన్న అనే యువతి ని ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్పీ ఆ అమ్మాయిని ప్రేమించి వారి తల్లిదండ్రులను ఒప్పించి మరి ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ మాటీవీలో జంటగా సందడి చేస్తున్నారు. కామెడీ స్టార్స్ షోలో పార్టీ చేద్దాం పుష్ప అనే ఈవెంట్ లో కిరాక్ ఆర్పీ తనకి కాబోయే భార్యతో కలిసి ఒక డాన్స్ పర్ఫార్మ్ చేశాడు. ఈ షోలో ఆర్పీ తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టాడు.ఇటీవల ఈ జంట ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో కిరాక్ ఆర్పీ తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అంతేకాకుండా జబర్దస్త్ షో మీద, ఆ షో యాజమాన్యం మీద తీవ్ర విమర్శలు చేశాడు. అంతే కాకుండా నాగబాబు గురించి కూడ పొగిడాడు. కిరాక్ ఆర్పీ నాగబాబు మీదున్న అభిమానంతో ఆయన పేరుని తన గుండెల మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ ఇంటర్వ్యూలో మీరు అమ్మాయి తరఫునుండి ఎంత కట్నం తీసుకుంటున్నారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్పీ సమాధానం చెబుతూ అమ్మాయి నుండి నేను ఒక రూపాయి కూడా కట్నం తీసుకోవడం లేదు. అమ్మాయి డబ్బులతో బతకడం నాకు నచ్చదు. నాకు కాబోయే భార్య కుటుంబ సభ్యులకు కోసం ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా నా సొంత డబ్బులతో జరిపించాను . నాకు కట్నంగా వారు ఒక ఫ్లాట్ ఇస్తామన్నారు. కానీ నాకు అమ్మాయి తరుపు నుండి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు అని చెప్పుకొచ్చాడు.