టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య బెంగళూరుకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలు ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఎట్టకేలకు పెళ్లి విషయాన్ని ప్రకటించారు.ఈ విధంగా నాగశౌర్య పెళ్లి గురించి ప్రకటన ఇవ్వడంతో ప్రతి ఒక్కరు అనూష శెట్టి ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ విధంగా అనూష బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ఈమె కూడా ఇంటీరియర్ డిజైనింగ్ లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ లో ది బెస్ట్ డిజైనర్ గా అవార్డును కూడా అందుకున్నారు. ఇక నాగశౌర్య ఈమె డిజైనింగ్ నచ్చి తనకు కొన్ని కాంట్రాక్ట్ ఇప్పించడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ విధంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులగురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అనూష సిటీని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నాగశౌర్య ఎంత మొత్తంలో కట్నం తీసుకున్నారా అనే విషయం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అనూష శెట్టిని వివాహం చేసుకున్నటువంటి నాగశౌర్య పెళ్లిలో నగదు రూపంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని అయితే అనూష పేరుపై ఇప్పటికే సుమారు 50 కోట్లకు పైగా ఆస్తి ఉండడంతో అందులో కొంత ఆస్తిని నాగశౌర్య పేరుపై ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు సమాచారం.మొత్తానికి నాగశౌర్య అనూష శెట్టిని వివాహం చేసుకున్న తర్వాత 50 కోట్ల రూపాయల ఆస్తులను కట్నంగా తీసుకున్నారని తెలుస్తోంది.