అదనపు కట్నానికి బలైన వివాహిత… హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ?

దేశం రోజుకి అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేశం లో ఈ వరకట్నం అనే మహమ్మారి మాత్రం వదలడం లేదు. ప్రభుత్వం వరకట్నాన్ని నిషేధించినప్పటికీ ఇది ఒక ఆచారంగా కొనసాగుతోంది. ఆడపిల్ల పెళ్ళి కావాలంటే లక్షల రూపాయల కట్నం ఇవ్వాల్సిందే. అలా కట్నం ఇచ్చి పెళ్ళి చేసినా కూడా కొంతమంది మూర్ఖులు అదనపు కట్నం కోసం భార్యల ను హింసిస్తున్నారు. మరికొంతమంది క్రూరంగా ప్రవర్తిస్తూ భార్యలను హత్య చేయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా బీహార్ లో ఎటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. అది నాకు కట్నం కోసం మొబైల్ చార్జర్ తో భార్యని ఉరి తీసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…బీహార్ లోని పాట్నాలో దుల్హిన్ బజార్‌లో బుధవారం ఉదయం ఈ దారుణ సంఘటన చోటచేసుకుంది . దుల్హన్ బజార్‌కు చెందిన అన్వర్‌ కు పాలిగంజ్‌కు చెందిన పర్వానా పర్వీన్ అనే యువతితో 2019 లో వివాహాం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గత రెండేళ్లుగా పర్వీన్‌ భర్త తో పాటు అత్తమామలు , ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధించేవారు. ఈ విషయం తన కుటుంబసభ్యులతో చెప్పుకొని పర్వీన్ బాధపడేది. అదనపు కట్నం కోసం రోజురోజుకి అన్వర్ వేదింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బుధవారం మొబైల్ చార్జర్ తో పర్వీన్ గొంతు నులిమి హత్య చేసి చేశారు. ఆ తర్వాత ఆమెను ఫ్యాన్ కి వేలాడ దీసి ఆత్మహత్య గా చిత్రీకరించారు.

బుధవారం పర్వీన్ సోదరుడికి ఫోన్ చేసి పర్వీన్ ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలియచేశారు. అయితే ఈ ఘటనపై పర్వీన్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పర్వీన్ భర్త, అత్త మామలు అదనపు కట్నం కోసం తన సోదరిని హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలిసులు అన్వర్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు బయటపెడతామని పోలిసులు వెల్లడించారు. పర్వీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా పోలిసులు విచారణ ప్రారంభించనున్నారు.