ఎన్టీఆర్ కి కట్నం కింద లక్ష్మీ ప్రణతి ఎన్ని కోట్ల ఆస్తి తీసుకొచ్చిందో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ ప్రముఖ వ్యాపార వేత్త నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతి అనే యువతని 2011 మే 6వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు..

ఈ విధంగా లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కలరు. ఇక ఎన్టీఆర్ వివాహాన్ని నారా చంద్రబాబునాయుడు దగ్గరుండి చేశారని ఈ సంబంధాన్ని చంద్రబాబునాయుడు తీసుకువచ్చారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లక్ష్మీ ప్రణతి స్వయానా చంద్రబాబు నాయుడు మేనకోడలి కుమార్తె అని తెలుస్తుంది. ఎన్టీఆర్ పెళ్లి సమయంలో లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కి భారీగానే ఆస్తి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అప్పట్లోనే హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 250 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ కు కట్నంగా తీసుకువచ్చారట.

ఇక ప్రస్తుతం ఈ ఆస్తి విలువ మరింత పెరిగిందని ఈ ఆస్తి దాదాపు 1200 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతి భారీగానే కట్న కానుకలు తీసుకువచ్చారు.ఇకపోతే అప్పట్లో ఎన్టీఆర్ చాలా చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేశారు.అయితే ఎన్టీఆర్ లక్ష్మీప్రతి వివాహం గురించి మాట్లాడే సమయానికి ఆమె మైనర్ అయినప్పటికీ ఆమె మైనారిటీ తీరిన తర్వాతే ఎన్టీఆర్ తనని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.