సైమా అవార్డ్ ఫంక్షన్ కి భారీ రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీముఖి.. ఎంతంటే?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదుర్స్ ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత చానల్ తో సంబంధం లేకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఎన్నో టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తూ తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శ్రీముఖి ఇలా టీవీ షోస్ మాత్రమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక స్పెషల్ ఈవెంట్స్ లో కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది.

అంతేకాకుండా మరొకవైపు సినిమాలలో నటిస్తు బిజీగా ఉంది. ఇలా యాంకర్ గా బుల్లితెర మీద మాత్రమే సందడి చేస్తున్న శ్రీముఖి ఇటీవల సినిమా అవార్డు ఫంక్షన్ లో కూడా సందడి చేసింది. సౌత్ ఇండస్ట్రీలో ఎంతో గౌరవప్రదంగా భావించే సైమా అవార్డు ఈవెంట్ ఇటీవల బెంగళూరులో రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆలీతో కలిసి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ ఈవెంట్ లో ఎంతోమంది సౌత్ ఇండియన్ నటీనటులు పాల్గొన్నారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా ఈ అవార్డు ఫంక్షన్ కి హాజరయ్యాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీముఖి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా శ్రీముఖి ఒక టీవీ షో కి ఒకరోజు కోసం దాదాపు రెండున్నర నుండి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ఇక ఇటీవల సైమా అవార్డ్ ఫంక్షన్ లో హోస్ట్ గా వ్యవహరించిన శ్రీముఖి ఈ ఈవెంట్ కోసం దాదాపు రూ.5 లక్షలు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సైమా అవార్డ్ ఫంక్షన్ కి శ్రీముఖి మొత్తం రూ.10 లక్షలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమ వంటి స్టార్ యాంకర్ ఇంత మొత్తం రెమ్యునరేషన్ అందుకుంటోంది. సుమ తర్వాత శ్రీముఖి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోవటం రాములమ్మ కి ఇంత డిమాండ్ ఉందా అని అందరూ నోరెళ్ళబెడుతున్నారు.