స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్న శ్రీముఖి… ఇందులో నిజమెంత?

బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న వారిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి అందరికీ సుపరిచితమే. ప్రతి ఒక్క ఛానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడిచేస్తోంది. అదేవిధంగా వెండి తెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యి బిజీగా గడుపుతున్నటువంటి శ్రీముఖి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొఫెసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాత వరసకు కొడుకు అయ్యే వ్యక్తితో శ్రీముఖి పెళ్లి జరగబోతుందని త్వరలోనే ఆ ఇంటికి కోడలుగా శ్రీముఖి అడుగుపెట్టబోతుందని సమాచారం. ఈ క్రమంలోనే శ్రీముఖి తండ్రి సదరు నిర్మాత ద్వారా తన సమీప బంధువులను సంప్రదించి పెళ్లి గురించి మాట్లాడారని సమాచారం.అయితే శ్రీముఖి మాత్రం ఈ పెళ్లికి నో చెప్పినట్టు తెలుస్తుంది.

శ్రీముఖి టాప్ యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరో వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని ఇలా శ్రీముఖి ప్రేమలో ఉండడం వల్ల తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే శ్రీముఖి ప్రేమించిన వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయం తెలియక పోయినప్పటికీ ఈ వార్త మాత్రం కాదు కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. త్వరలోనే శ్రీముఖి తనుకు కాబోయే వ్యక్తిని పరిచయం చేయబోతున్నారని సమాచారం.