గాడ్ ఫాదర్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న చిరు.. సల్మాన్ కి ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇప్పటివరకు నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. అయితే తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అభిమానులు సైతం బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఒక్కో సినిమాకు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఏకంగా ఈయన తన కొడుకు రామ్ చరణ్ కు పోటీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం రామ్ చరణ్ రాజమౌళి సినిమా కోసం దాదాపు 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అయితే గాడ్ ఫాదర్ కోసం చిరంజీవి ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా నిర్మాణంలో రాంచరణ్ భాగస్వామ్యం అయినప్పటికీ బడ్జెట్ విషయంలో వీరిద్దరూ ఎంతో కచ్చితంగా ఉంటారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ చిరంజీవి కోసం 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వగా సల్మాన్ కోసం మరో ఐదు కోట్ల రెమ్యూనరేషన్ పక్కన పెట్టారని తెలుస్తోంది.రామ్ చరణ్ చిరంజీవి పై ఉన్న అభిమానంతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి హిట్ కావడంతో సల్మాన్ ఖాన్ కి రెమ్యూనరేషన్ ఇచ్చిన ఆయన తీసుకోరు అందుకే ఆయనకు రెమ్యూనరేషన్ కాకుండా ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చరణ్ ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిరంజీవి కూడా వెల్లడించారు. త్వరలోనే రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ ని కలిసి తనకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.