శ్రీముఖి అందాల ఆరబోత పై తబలా వాయించి మరీ సంచలన వ్యాఖ్యలు చేసిన అవినాష్..?

బుల్లితెర మీద సందడి చేస్తున్న గ్లామరస్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి తన అందంతో పాటు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అనేక టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందిన శ్రీముఖి సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది. ఈ క్రమంలో జులాయి, నేను శైలజ, క్రేజీ అంకుల్స్ వంటి ఎన్నో సినిమాలలో కీలకపాత్రలలో నటించింది. ఇలా సినిమాలు, టీవీ షోస్ తో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో శ్రీముఖి ఈ మధ్య తన జోరు మరింత పెంచినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఫన్నీ వీడియోస్ తో సందడి చేస్తున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచి అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీముఖి గ్లామరస్ ఫోటోలు చూసి కుర్రాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారు. ఇలా శ్రీముఖి రోజుకి తన గ్లామర్ తో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇదిలా ఉండగా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ముక్కు అవినాష్ ఇటీవల శ్రీముఖి అందాల గురించి మాటల్లో చెప్పలేని విధంగా తబలా వాయిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మాటీవీలో ప్రసారమవుతున్న ఆదివారం పరివార్ అనే షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ షోలో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించగా ముక్కు అవినాష్ కూడా శ్రీముఖి తో పాటు ఈ షోలో సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ప్రోమోలో అవినాష్ శ్రీముఖి అందం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో శ్రీముఖి షేర్ చేస్తున్న గ్లామరస్ ఫోటోల గురించి మాటల్లో కాకుండా తబలా వాయించి మరి తన మనసులోని మాటలు తబలా శబ్దం రూపంలో బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.