అందరి ముందు గాడిద అంటూ అవినాష్ పరువు తీసిన శ్రీముఖి.. షాక్ లో అవినాష్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీముఖి అలాగే కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ ఇద్దరు ఎంత మంచి స్నేహితులు మనకు తెలిసిందే.వీరిద్దరూ మంచి స్నేహితులు కావడమే కాకుండా ఇద్దరు కలిసి ఆన్ స్క్రీన్ పై పెద్ద ఎత్తున సందడి చేస్తూ అభిమానులను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అవినాష్ కి బిగ్ బాస్ అవకాశం రావడంతో జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లాలంటే అగ్రిమెంట్ ప్రకారం 10 లక్షలు చెల్లించాలి. ఆ సమయంలో శ్రీముఖి అవినాష్ కి అండగా నిలబడి తనకు 10 లక్షలు ఇచ్చి తనని ఎంతగానో ఆదుకున్నారు.

ఇలా ఈ సంఘటనతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే అవినాష్ పెళ్లి కార్యక్రమాలలో శ్రీముఖి దగ్గరుండి అన్ని పనులు చేశారు.ఇకపోతే యాంకర్ గా శ్రీముఖి పలానా ఛానల్ అని లేకుండా అన్ని ఛానల్లోనూ ఎంతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మా లో విత్ స్టార్ మా పరివార్ అనే కార్యక్రమం ద్వారా శ్రీముఖి సందడి చేస్తున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అత్తా కోడల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే అవినాష్ హరి వంటి కమెడియన్లు కూడా సందడి చేశారు.

ఇక దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడంతో ఇందులో ముక్కు అవినాష్ చీరలు అమ్మే వ్యక్తిగా కనిపిస్తారు. ఈ క్రమంలోని ఒక్కో చీర కట్టుకుంటూ ఈ చీర ఫలానా సెలబ్రిటీ కట్టుకున్నది అంటూ చీరలు చూపిస్తారు. ఈ క్రమంలోనే అంటే అన్ని వాళ్ళు వదిలేసిన చీరలేనా అని నటి హరిత అనగా వెంటనే అలాంటి మోడల్స్ అంటూ అవినాష్ చెప్పగానే వెంటనే స్పందించిన శ్రీముఖి ముందు అది చెప్పు గాడిద అంటూ బాలకృష్ణ స్టైల్ లో అవినాష్ ను గాడిద అంటూ అందరి ముందు తన పరువు తీశారు. ప్రస్తుతం శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.