జోరు పెంచిన శ్రీరామ్: ఎట్టకేలకు స్ర్కీన్ స్పేస్ దక్కించుకుంటున్నాడుగా.!

Sreeramachandra The Tough Contestant | Telugu Rajyam

బిగ‌బాస్‌లోకి రాక ముందు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటేషన్ విన్నర్‌గా శ్రీరామ్ చంద్రకు చాలా చాలా పాపులారిటీ ఉంది. కేవలం తెలుగులోనే కాదు, బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన సింగర్ శ్రీరామ్ చంద్ర. నిజంగానే మంచి గాయకుడు.

అయితే, బిగ్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. శ్రీరామ్ చంద్రకు మొదట్లో అస్సలు స్ర్కీన్ స్పేసే దక్కేది కాదు. హమీదాతో లవ్ ట్రాక్ నడపడం వల్ల ఒకింత బెటర్ అయ్యాడు శ్రీరామ్ చంద్ర. హమీదా బయటికొచ్చాక అసలు హౌస్‌లో శ్రీరామ్ ఉన్నాడా.? అనిపించేంతలా తన అప్పియరెన్స్ ఉంది.

కానీ, ఇప్పుడు శ్రీరామ్ బాగా చురుకయ్యాడు. టాస్కుల్లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. కాస్తో, కూస్తో కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేస్తున్నాడు. దాంతో ఆటోమెటిగ్గా శ్రీరామ్‌కి హౌస్‌లో స్ర్కీన్ స్పేస్ బాగానే దక్కుతోంది. సన్నీతో, మానస్‌తో శ్రీరామ్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుండడంలో శ్రీరామ్ ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తున్నాడు.

అలాగే లేటెస్టుగా నామినేషన్ ప్రక్రియలో భాగంగా, కాజల్‌ ఓ పట్టు పట్టాడు. ఏది ఏమైతేనేం. మొత్తానికి బిగ్ హౌస్‌లో శ్రీరామ్ పర్ఫామెన్స్ మొదలైందిక.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles