సోహైల్ తో గొడవ పెట్టుకున్న శ్రీముఖి… కారణం ఏమిటంటే…?

అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి ఛానల్ తో సంబంధం లేకుండా వీళ్ళు తెర మీద ప్రచారం అవుతున్న అనేక టీవీ షో లలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందింది ఇలా యాంకర్ గా పాపులర్ అయిన శ్రీముఖి సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారం అవుతున్న టీవీ షోలలో మాత్రమే కాకుండా ఆహా వేదికగా ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ షోలో కూడా టీం లీడర్ గా వ్యవహరిస్తోంది. ఈ డాన్స్ షోలో ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించగా.. శేఖర్ మాస్టర్, రమ్యకృష్ణ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక శ్రీముఖి, యశ్వంత్ మాస్టర్ టీం లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇటీవల బిగ్ బాస్ ఫేం సోహైల్ కూడా ఈ డాన్స్ షోలో టీం లీడర్ గా సందడి చేస్తున్నాడు. ఇది ఎలా ఉండగా ఈ వారం ప్రసారం కానున్న డాన్స్ ఐకాన్ షో ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ప్రోమోలో సోహెల్ శ్రీముఖి మధ్య గొడవ జరగ్గా రమ్యకృష్ణ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. శ్రీముఖి టీం నుండి ఆసిఫ్ అండ్ రాజు కలిసి నాటు నాటు పాటకు డాన్స్ వేశారు. వీరి పర్ఫార్మెన్స్ కి సోహైల్ రెడ్ కార్డ్ చూపించాడు. దాంతో హర్ట్ అయిన శ్రీముఖి.. అది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ మొదలుపెట్టింది. అప్పుడు సోహెల్ అలా ఏమీ లేదు ఇది డాన్స్ ఐకాన్ షో అంటే ఎక్స్పెక్టింగ్ మోర్ అంటూ చెప్పుకొచ్చాడు . వాళ్ళిద్దరి మధ్య కో ఆర్డినేషన్ మిస్ అయ్యిందని వివరించాడు.

ఆ తర్వాత గోవింద్, సౌమ్య డ్యాన్స్ చేసినప్పుడు యష్ , శ్రీముఖి ఇద్దరు కూడా అసలు ఈ సమయంలో చేయాల్సిన పర్ఫామెన్స్ ఆ అంటూ ఫైర్ అయ్యారు. దీంతో సోహైల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించగా శ్రీముఖి వెటకారంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఇలా వెటకారంగా మాట్లాడుతూ సోహైల్ తో గొడవ పడింది. ఇక వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవ చూసిన రమ్యకృష్ణ సీరియస్ అవుతూ మీరు చెప్పినట్లు జడ్జిమెంట్ ఇవ్వటానికి మేము ఈ సీట్లో కూర్చోవడం ఎందుకు అంటూ ఫైర్ అయ్యింది. రమ్యకృష్ణ ఇలా సీరియస్ అవ్వటంతో సెట్ లో వాతావరణం కొంచెం సీరియస్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.