Samantha: సినీ నటి సమంత ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కొద్దిరోజులపాటు ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత పూర్తిగా కోల్పోవడంతో తిరిగి కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇటీవల తన నిర్మాణ సంస్థ నుంచి విడుదలైన శుభం సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా మొదటి సినిమాకే మంచి ఆదరణ రావడంతో సామ్ తిరిగి తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.
ఇక సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు సింగిల్ గానే ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈమె డైరెక్టర్ రాజ్ నిడుమోరితో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల గురించి సోషల్ మీడియాలో రోజుకు ఒక వార్త రావడమే కాకుండా వీరిద్దరూ తరచూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఇక ఈ వార్తలను సమంత మేనేజర్ కొట్టి పారేసినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.
ఇకపోతే డైరెక్టర్ రాజ్ ఇదివరకే వివాహం చేసుకున్నారని, తన భార్యకు విడాకులు ఇవ్వడంతోనే సమంతతో రిలేషన్ లో ఉన్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి అయితే ఇటీవల కాలంలో రాజ్ భార్య శ్యామలీ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈమె కర్మ సిద్ధాంతం గురించి ఒక పోస్ట్ చేశారు.. కాలం అన్నింటిని బయటపెడుతుంది, కర్మ సమాధానం చెబుతుంది.. ఈ విశ్వం దీనిని నిశింతగా చూస్తూ ఉంటుంది అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది. అయితే ఈమె చేసిన పోస్ట్ కచ్చితంగా సమంతను ఉద్దేశించి చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.