టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు పొందిన తాగుబోతు రమేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించిన రమేష్ తాగుబోతుగా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని కమెడియన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇలా ఎన్నో సినిమాలలో నటించి కమెడియన్ గా పాపులర్ అయిన తాగుబోతు రమేష్ కి గత కొంతకాలంగా సినిమాలలో సరైన అవకాశాలు లభించడం లేదు. దీంతో జబర్దస్త్ కామెడీ షో ద్వారా సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇలా సినిమాలలో అవకాశాలు తగ్గటంతో వెంటనే జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలలో తాగుబోతు రమేష్ అందుకునే రెమ్యూనరేషన్ కన్నా.. జబర్దస్త్ లో రెమ్యూనరేషన్ తక్కువగా ఉన్నప్పటికీ… జబర్దస్త్ ద్వారా డబ్బు కన్నా పేరు సంపాదించుకోవాలని భావిస్తూ జబర్దస్త్ లో కమీడియన్ గా కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కమెడియన్ గా ప్రస్తుతం తనకి ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకొని జబర్దస్త్ లో కొనసాగుతూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటు.. వెండితెరపై మళ్లీ కనిపించే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.
జబర్థస్త్ లో తాగుబోతు రమేష్ టీం లీడర్ కాదు. మరో టీం లీడర్ తో టీం పంచుకుంటున్నాడు. అందుకే జబర్థస్త్ లో తాగుబోతు రమేష్ పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. జబర్దస్త్ కమెడియన్స్ లో చాలా మందికి మల్లెమాల వారు తక్కువ రేమ్యునరేషన్ ఇస్తున్నారు. అయితే వారి కంటే తక్కువగా తాగుబోతు రమేష్ కి ఒక్కో ఎపిసోడ్ 50 వేల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ భవిష్యత్తులో సినిమాలలో మళ్లీ అవకాశాలు అందుకోవటం కోసం రెమ్యూనరేషన్ తక్కువ అయినా కూడా ఆయన జబర్దస్త్ లో కొనసాగుతున్నాడని తెలుస్తోంది.
సినిమాలలో కమీడియన్ గా ఆఫర్లు అందుకోవటం కోసమే ఇలా జబర్దస్త్ లో కొనసాగుతున్నట్లు సమచారం. ఇలా జబర్దస్త్ లో కమీడియన్ గా కొనసాగటం వల్ల సినిమాలలో ఆఫర్లు రావటమే కాకుండా ఇతర టీవీ షోలతో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా అవకాశాలు వస్తాయని భావించి జబర్దస్త్ లో కొనసాగుతున్నట్లు అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.