బిగ్ బాస్ బ్యూటీ అరియాన నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న ఎంతో మంది కంటెస్టెంట్లు బాగా పాపులర్ అయ్యి సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. అయితే ఈ రియాలిటీ షోలో పాల్గొనే వారిలో ఎక్కువ శాతం సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారే ఉంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్న అరీయాన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఒకప్పుడు హోస్ట్ గా వ్యవరించిన అరియనాకి సరైన గుర్తింపు లభించలేదు. కానీ బిగ్ బాస్ షోలో పాల్గొనటం వల్ల బాగా పాపులర్ అయ్యింది. ఇలా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత టీవి షోలలో పాల్గొనే అవకాశం దక్కించుకోవడమే కాకుండా బిగ్ బాస్ బజ్ లో హోస్ట్ గా వ్యవరించి బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ.. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇక ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు సీజన్ లో కూడా పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది.

ఇలా బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆరియనా పాపులర్ అవ్వడమే కాకుండా మంచి రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ఇలా బిగ్ బాస్ రెండు సీజన్లకు గాను అరియనా డబ్బు బాగా వెనకేసుకుందని సమాచారం. ఇక ఇప్పుడు బిగ్ బాస్ బజ్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నందుకు అరియనా రోజుకి 60 వేల నుంచి లక్ష రూపాయలు దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమచారం. ఈ లెక్కన చూస్తే హౌస్ లో ఉన్న వారి కన్నా బి బి కేఫ్ ద్వారా అరియానా రెమ్యూనరేషన్ ఎక్కువని తెలుస్తోంది. అంతేకాదు పలు యాడ్స్ ప్రమోట్ చేయడం ద్వారా ..ఇన్స్టా ఫాలోవర్స్ ద్వారా మిగతా ఆదాయాల ద్వారా నెలకు లక్ష 30 వేలు వరకు సంపాదిస్తుందని సమాచారం.