నన్ను అవమానిస్తే ఊరుకోను.. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆవేదన!

సోషల్ మీడియాలో వెరైటీ డ్రెస్సులు ధరిస్తూ విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్ ఊర్ఫీ జావేద్. కొన్ని రకాల బట్టలను క్రియేట్ చేసి మరీ స్టైలిష్ డ్రస్సులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఫ్యాషన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రకరకాల డ్రస్సులతో అందరిని అలరిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ బ్యూటీగా కూడా ఈమె అందరికీ సుపరిచితమే. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామ పలు షోలకి గెస్ట్ గా వెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ మధ్య ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ అనే షోకి వెళ్ళింది.

అక్కడ కొంతమంది ఆమెపై అభ్యంతరకర కామెంట్లు చేయడంతో మధ్యలోనే లేచి వెళ్లిపోయింది. అయితే ఈ విషయంపై హర్ట్ అయిన ఉర్ఫీ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. వ్యూస్ రాబట్టేందుకు ఇతరులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఈ రోజుల్లో సామాన్యమైపోయింది, కానీ నన్ను అవమానిస్తుంటే, వేధిస్తుంటే అవకాశాల కోసం కొంతమందితో ఉన్నానని ఏవేవో లెక్కలు వేస్తుంటే ఊరుకునేది లేదు.

ఉన్న ఫళంగా ఫేమస్ అయిపోవడానికే ఇదంతా చేస్తున్నారా అంటూ నిలదీసింది. ఒక షో కి వెళ్ళినప్పుడు అక్కడ స్టేజ్ పై ఒక వ్యక్తిని ఎందుకు వికలాంగుడి లాగా నటిస్తున్నావు అని అడిగాను. అందుకు అతను అందరి ముందు నాపై దూర్భాషలాడాడు, కోపంతో పిచ్చి పిచ్చిగా అరిచేసాడు, నన్ను మియా కలీఫా తో పోల్చుతూ పతివ్రత అని అవమానిస్తూ నా శరీర గణనపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

నాకు అవమానంగా అనిపించింది కానీ అక్కడ ఏమీ అనకుండా వెళ్లిపోయాను. ఈ సంఘటనకు సమ్ రైనాకు ఎలాంటి సంబంధం లేదు, అతడు నాకు మంచి మిత్రుడు నేను అతడిని ఏమీ అనట్లేదు కానీ అక్కడ ఉన్న మిగిలిన కంటెస్టెంట్ ల గురించి మాట్లాడుతున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక నోట్ షేర్ చేసింది ఉర్ఫీ . ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.