భారీగా సంపాదిస్తున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్… నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో నంబర్ వన్ కామెడీ షో గా గుర్తింపు పొందింది . ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది తమ టాలెంటుని నిరూపించుకొని కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందటమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మంచి అవకాశాలు దక్కించుకొని ఆర్థికంగా స్థిరపడుతున్నారు . ఇలా జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన పంచ్ ప్రసాద్ కూడా కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు.

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన పంచ్ ప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. అయితే ఆ సమయంలో తోటి జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు మల్లెమాల యాజమాన్యం కూడా ప్రసాద్ కి అండగా ఉంది సరైన సమయంలో చికిత్స చేయించడంతో ప్రసాద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా చావు నుండి తప్పించుకొని బయటపడిన పంచ్ ప్రసాద్ ఇప్పుడు ఈటీవీలో ప్రసారమవుతున్న అన్ని కామెడీ షోస్ లో అవకాశాలు దక్కించుకుని సందడి చేస్తున్నాడు.

అనారోగ్యం కారణంగా ఆర్థికంగా నష్టపోయిన పంచ్ ప్రసాద్ ని ఆదుకోవడానికి మల్లెమాలవారు ప్రతి ఈవెంట్ లోను అవకాశాలు కల్పించి అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ అందజేస్తున్నారు. ఇలా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు వంటి షోస్ ద్వారా ప్రసాద్ నెలకి దాదాపు 3 నుండి 5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. అనారోగ్యంతో చనిపోతానని అనుకున్న ప్రసాద్.. మల్లెమాలవారు ఆదుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడటమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుకుంటున్నాడు.