ప్రేమించిన వాడి కోసం నాలుగేళ్లు నరకం చూసిన బిగ్ బాస్ బ్యూటీ?

బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ 6 లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇటీవల ప్రారంభమైన సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప కూడా ఒకరు. సుదీప అంటే చాలామందికి గుర్తుకు రాకపోవచ్చు. కానీ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకువస్తుంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సుదీప చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయ్యింది. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్ర ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.

ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకున్న పింకీ..హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పింకీ తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో తన ప్రేమ పెళ్లి గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన సుదీప శ్రీ రంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట శ్రీ రంగనాథ్ ని ప్రేమించిన సుదీప ఈ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే వారు వీరి ప్రేమను అంగీకరించకపోవటమే కాకుండా సుదీపకు వేరే పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేశారు.

ఈ క్రమంలో పెళ్లి సంబంధాలు కూడా చూశారు. అయితే సుదీప వచ్చిన సంబంధాలన్నింటిని తిరస్కరించడమే కాకుండా రెండు మూడు రోజులపాటు అన్నం తినకుండా ఉండటంతో ఎట్టకేలకు సుదీప తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించారు. ఇలా తను ప్రేమించిన వాడిని సొంతం చేసుకోవడం కోసం దాదాపు నాలుగేళ్ల పాటు నరకం చూసానని సుదీప ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన సుదీప ఎంత కాలం హౌస్ లో కొనసాగుతుందో చూడాలి మరి.