అందాల యాంకర్ అనసూయ ఆస్తుల చిట్టా ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ ఈ కామెడీ షో లో తన గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన అనసూయ అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందింది. ఇలా యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటోంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ అప్పటి నుండి సినిమాలలో వరుస అవకాశాలు అందుకుంటుంది.

ఇలా వరుసగా టీవీ షోస్, సినిమాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అందాలతో అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఇలా వరుస టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్ లో చేస్తూ బిజీగా ఉండే అనసూయ ఆదాయం కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. అనసూయ కి జూబ్లీహిల్స్ లో 8 కోట్ల విలువ చేసే ఖరీదైన ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా దాదాపు మూడు కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జబర్దస్త్ షో మానేసినా కూడా ఇతర చానల్స్ లో ప్రసారం అవుతున్న టీవీ షోల ద్వారా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా టీవీ షోలు, సినిమాల ద్వారా ఏడాదికి దాదాపు రెండు నుండి మూడు కోట్ల వరకు ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటివరకు ఇండస్ట్రీలో యాంకర్ గా.. నటిగా గుర్తింపు పొందటమే కాకుండా దాదాపు రూ. 25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అనసూయ సినిమాలకే తన మొత్తం సమయాన్ని కేటాయిస్తోంది.