Karishma Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఖరీష్మా కపూర్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కరిష్మా కపూర్. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కరిష్మా కపూర్ కరిష్మా కపూర్ మాజీ భర్త ఆస్తి కోసం కోర్టు మెట్లెక్కింది. తన పిల్లలతో కలిసి ఆమె మాజీ భర్త ప్రియ కపూర్ పై న్యాయపోరాటానికి దిగింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తండ్రి ఆస్తిలోని తమ వాటా కోసం కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు చెందిన దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తి విషయంతో తమ సవతి తల్లి ప్రియా కపూర్ మోసం చేస్తుందని వారు ఆరోపించారు.
ఫ్యామిలీ మీటింగ్ తన తండ్రి రాసిన వీలునామా కాకుండా ఫేక్ డాక్యుమెట్స్ వీలునామా చూపించి మోసం చేస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆస్తి పంపకాల విషయం కొత్త మలుపు తిరిగింది. కాగా కరిష్మా కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ని 2003లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే అతడికి ఒకసారి పెళ్లి అయ్యి విడాకులు కూడా అయ్యాయి. కరిష్మా అతడికి రెండో భార్య. కొంతకాలం అన్యోన్యంగా జీవించిన వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. పదమూడేళ్ల పాటు కలిసి జీవించిన వీరు 2016లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత సంజయ్ కపూర్, ప్రియా సచ్ దేవ్ ని మూడో పెళ్లి చేసుకున్నాడు. కరిష్మాతో విడాకుల తర్వాత ప్రియాను పెళ్లి చేసుకున్న సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ లో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో తర్వాత కుటుంబంలో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. తండ్రి ఆస్తిలో తమకు వాటా దక్కకుండా సవతి తల్లి ప్రియ మోసం చేస్తోందని కరిష్మా కపూర్ పిల్లలు ఆరోపిస్తున్నారు.
Karishma Kapoor: మాజీ భర్త ఆస్తుల కోసం అలాంటి ప్లాన్ వేసిన కరిష్మా.. ఏకంగా అన్ని వేల కోట్లా!
