జబర్థస్త్ లో జడ్జ్ లకి మల్లెమాల వారు ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో 2013లో ప్రారంభమై ఇప్పటివరకు నిర్విఘ్నంగా కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ కామెడీ షో ఇంత ఫేమస్ అవ్వటానికి కమెడియన్లు పాత్ర ఎంత ఉందో… ఈ షోలో జడ్జిలుగా వ్యవహరించే వారి పాత్ర కూడా అంతే ఉంది. ఇక జబర్దస్త్ ప్రారంభంలో రోజా నాగబాబు ఈ షో కి చాలా కాలం జడ్జిలుగా వ్యవహరించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నాగబాబు జబర్దస్త్ కి దూరం కాగా.. కొంతమంది హీరోయిన్లను గెస్ట్ జడ్జి గా ఆహ్వానించి కొంతకాలం మేనేజ్ చేశారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో రోజా కూడా వెళ్లిపోవడంతో ఇంద్రజ కృష్ణ భగవాన్ జడ్జిలుగా కొనసాగుతున్నారు.

ఇలా జబర్దస్త్ లో జడ్జిలుగా వ్యవహరించిన వారికి మల్లెమాలవారు ఎంతెంత రెమ్యూనరేషన్ ఇచ్చారు ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రోజా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించినందుకు అందరికంటే అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకుంది. ఈ క్రమంలో మల్లెమాలవారు ఒక ఎపిసోడ్ కి దాదాపు రూ.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారని సమాచారం.

ఇక నాగబాబుకి కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. హీరోగా కాకపోయినా నటుడిగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న నాగబాబు జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తూ జబర్దస్త్ కి మూల స్తంభం లా ఉండేవాడు. అలాంటి నాగబాబు కి మల్లెమాల వారు ఒక ఎపిసోడ్ కి రూ. .3 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నాగబాబు నటుడిగా మంచి గుర్తింపు పొందిన కూడా హీరో కాదు కాబట్టి 3 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేవారు.

ఇక నటి ఇంద్రజ కూడా జబర్థస్త్ జడ్జ్ గా మంచి గుర్తింపు పొందింది. జబర్దస్త్ కి రోజా దూరమైన తర్వాత ఆమె స్థానంలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కి మల్లెమాలవారు ఒక ఎపిసోడ్ కి రూ. 2.50 లక్షలు వారితోషికం అందజేస్తున్నారు. అలాగే గత కొన్ని ఎపిసోడ్స్ నుండి జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న కమీడియన్ కృష్ణ భగవాన్ కి కూడా ఇంద్రజ తో సమానంగా ఒక ఎపిసోడ్ కి రూ. 2.50 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.