ఈ మాత్రం దానికి గోవా వరకు వెళ్లాలా… బూతు పదాలతో రచ్చ చేసిన తాగుబోతు రమేష్?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం డబుల్ మీనింగ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.ఈ కార్యక్రమం మొదట్లో ఇలా బూతు పదాలతో డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడంతో ఈ కార్యక్రమం ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.ఇలా ఈ కార్యక్రమం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కాస్త ఇలాంటి బూతు పదాలు ఉపయోగించడం తగ్గించినప్పటికీ ప్రస్తుతం తిరిగి ఈ కార్యక్రమం పాత రోజులను గుర్తు చేసేలా ఉందని చెప్పాలి.ఈ కార్యక్రమంలో నుంచి ఎంతో గుర్తింపు పొందిన కమెడియన్స్ బయటికి వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమ రేటింగ్ కోసం కంటెస్టెంట్లు తిరిగి బూతు పదాలతో డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా తాగుబోతు రమేష్ స్కిట్ లో ఏకంగా బూతు పదాలు వాడడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది.తాగుబోతు రమేష్ తన భార్యతో కలిసి హనీమూన్ కోసం గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలోనే తన వాట్సాప్ స్టేటస్ హ్యాపీ మోడ్ అని పెట్టగా తన భార్య అది చూసి ఏవేవో ఊహించుకుంటుంది.ఈ క్రమంలోనే తాగుబోతు రమేష్ వద్దకు వెళ్లి గోవా వెళ్లి హనీమూన్ లో ఏం చేస్తారు అని ప్రశ్నించింది.

ఈ విధంగా అడిగేసరికి తాగుబోతు రమేష్ సముద్రం ఒడ్డున బీచ్ లో పొట్టి పొట్టి దుస్తులు ధరించి మూన్ ను చూస్తూ హనీ నాకడం అంటూ బూతు పదాలతో డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు.ఈ మాట విన్న తన భార్య ఈ మాత్రం నాకడానికి గోవా వరకు వెళ్లాలా అంటూ పంచ్ వేసింది. మొత్తానికి ఈ కార్యక్రమంలో బూతు పదాలతో డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారని తెలిసినప్పటికీ ప్రేక్షకులు కూడా వాటిని అర్థం చేసుకొని తమదైన శైలిలో ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కార్యక్రమం తిరిగి పాత రోజులను గుర్తు చేస్తుందని చెప్పాలి.