Ram Charan: కమెడియన్ కాళ్లకు దండం పెట్టబోయిన చరణ్… ఫిదా అవుతున్న అభిమానులు!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కాబోతుంది అంటూ అధికారకంగా కూడా వెల్లడించారు.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఈయన ఒక కమెడియన్ కాళ్లకు దండం పెట్టబోయారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే యాంకర్ ప్రదీప్ ఇటీవల తన రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ప్రదీప్ మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే యాంకర్ ప్రదీప్ తో పాటు కమెడియన్ సత్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిశారు. అక్కడ సత్య .. చరణ్ నాకు బాగా క్లోజ్ అని, నేను ఎంత చెప్తే అంత అని కాసేపు కామెడీ చేసారు. చరణ్ కూడా సత్య అసలు ఎవరో తెలియనట్టు ఆటపట్టించారు.

ఇక ఈ సినిమా మొదటి టికెట్ రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఈ విధంగా చరణ్ టికెట్ కొనుగోలు చేయడంతో సత్య రామ్ చరణ్ కాళ్లకు దండం పెట్టబోయారు. అనంతరం వెంటనే రామ్ చరణ్ కూడా సత్య కాళ్లకు నమస్కరించడానికి వచ్చారు.ఇది చూసిన చాలా మంది రామ్ చరణ్ కూడా భలే సరదా మనిషిగా అని కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది చరణ్ సింప్లిసిటీకి ఫిదా అవుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.