జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ల కోసం మల్లెమాల వారు రష్మి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్..?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
మొదట సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన రష్మీ ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా అవకాశం పొందింది. జబర్దస్త్ లో రష్మీ యాంకరింగ్ తో పాటు ఆమె గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ షో ద్వారా రష్మి గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా కొంతకాలం తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఇప్పటివరకు కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా జబర్దస్త్ లో వలసలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన చాలామంది జబర్దస్త్ కి దూరమయ్యారు.

ఈ క్రమంలో రష్మీ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు మల్లెమాలవారు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో ని కూడా ప్రారంభించారు. ఈ షో ప్రారంభించిన తర్వాత కొంతకాలం సుధీర్ యాంకర్ గా వ్యవహరించాడు. అయితే సుధీర్ జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా దూరమయ్యాడు. దీంతో శ్రీదేవి డ్రామా కంపెని షో లో సుధీర్ స్థానంలో రష్మీ యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఇక ఇటీవల అనసూయ కూడా జబర్దస్త్ కి దూరమైంది. ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ సినిమా అవకాశాలు రావటంతో జబర్దస్త్ కి దూరమయింది. అనసూయ జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిపోవడం రష్మీకి బాగా కలిసొచ్చింది. అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా కూడా రష్మినే కొనసాగుతోంది.

ఇలా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు కామెడీ షోస్ లో రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో రష్మీ ఆదాయం కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఒక కాల్ షీట్ కోసం నాలుగు నుండి ఐదు లక్షల వరకు
రేమ్యునరేషన్ అందుకునే రష్మి ఇప్పుడు తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టు సమాచారం. జబర్థస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కోసం రష్మి వారంలో 5 నుండి 6 రోజుల పాటు డేట్స్ ఇవ్వాల్సి వస్తోంది. అందువల్ల ప్రస్తుతం ఒక కాల్ షీట్ కోసం మల్లెమాల వారు రష్మి కి ఆరు లక్షల వరకు రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకారం ఒక వారానికి రష్మి దాదాపు 35 లక్షల వరకు సంపాదిస్తోంది.