బిగ్ బాస్ కి షాక్.. షో నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది.ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారమవుతుంది అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి గత కొన్ని సీజన్లో నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే.కొంతమంది ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆదరిస్తుండగా మరి కొంతమంది ఈ కార్యక్రమం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి మరొక షాక్ తగిలింది.

బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అడ్వకేట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా అడ్వకేట్ సీజన్లో అశ్లీలత ఎక్కువగా ఉందని ఇలాంటి కార్యక్రమాలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేసుకోవాలంటూ ఈయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి అశ్లీలత ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రసారం చేయడం వల్ల ఎంతోమంది చెడు మార్గంలో ప్రయాణించే అవకాశాలు ఉండటం వల్లే అడ్వకేట్ ఈ కార్యక్రమం పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది.

మరి అడ్వకేట్ జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.అయితే ఇదివరకే ఈ కార్యక్రమం పై సిపిఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇదివరకే పలుమార్లు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేసినప్పటికీ ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది అయితే ప్రస్తుతం హైకోర్టు నుంచి ఈ కార్యక్రమానికి ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.