అక్కడా ఇక్కడా వాడేస్తున్నారు.. శివ శంకర్ మాస్టర్ రచ్చ!!

కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గురించి తెలియని వారు, వినని వారెవ్వరూ ఉండరు. శివ శంకర్ మాస్టర్ అంటే అందరికీ ఓ ప్రత్యేక వస్త్రాధారణ, ఆకట్టుబొట్టూ అందరికీ కనిపిస్తాయి. ముఖ్యంగ ఆ మాట తీరుమరింత ఫేమస్. ఇక రియాల్టీ షోల్లో శివ శంకర్ మాస్టర్ న్యాయ నిర్ణేతగా అప్పట్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. అయితే శివశంకర్ మాస్టర్ మాత్రం ఈ మధ్య బుల్లితెరపై మళ్లీ సందడం చేయడంప్రారంభించాడు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా దుమ్ములేపుతున్నాడు.

Shiva Shankar Master In Extra Jabardasth
Shiva Shankar Master In Extra Jabardasth

మొదటగా శివ శంకర్ మాస్టర్ జబర్దస్త్ షోపై రచ్చ చేశాడు. ఆ మధ్య గెస్ట్ ఎంట్రీ ఇచ్చి కామెడీ చేశారు. హైపర్ ఆది స్కిట్స్‌లో రచ్చ చేసి మాయమయ్యాడు. మళ్లీ రీసెంట్‌గా బొమ్మ అదిరింది షోలో మెరిశాడు. అక్కడ శివ శంకర్ మాస్టర్‌ను ఓ రేంజ్‌లో ఇమిటేట్ చేసి పడేశారు. ఆ స్కిట్ కూడా ఓరేంజ్‌లో పండింది. అయితే మళ్లీ శివ శంకర్ మాస్టర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలోకి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు.

Shiva Shankar Master In Extra Jabardasth
Shiva Shankar Master In Extra Jabardasth

బుల్లెట్ భాస్కర్ టీంలో నువ్వా నేనా అనే డ్యాన్స్ ప్రోగ్రాం స్కిట్ వేశారు. అందులో శివ శంకర్ మాస్టర్ న్యాయ నిర్ణేతగా ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి అదిరింది, జబర్దస్త్ టీంలు శివ శంకర్ మాస్టర్‌ను, శివ శంకర్ మాస్టర్ ఆ రెండు కామెడీ షోలను బాగా వాడేసుకుంటున్నారు. అలా గెస్ట్‌గా వచ్చి అయినా శివ శంకర్ మాస్టర్ వార్తల్లో నిలుస్తున్నాడు.