అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన జబర్దస్త్ కమెడియన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇలా ఎంతోమంది జబర్దస్త్ లో పాల్గొనే అవకాశాలు దక్కించుకొని కమెడియన్లుగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు. గత కొంతకాలంగా జబర్దస్త్ లో మేల్ కమెడియన్స్ మాత్రమే కాకుండా ఫిమేల్ కమెడియన్స్ కూడా బాగా పాపులర్ అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన ఫిమేల్ కంటెస్టెంట్లలో వర్ష కూడా ఒకరు. హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వర్ష జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా బాగా పాపులర్ అయింది.

ముఖ్యంగా ఇమాన్యుల్ తో కలిసి ప్రేమ పెళ్ళి అంటూ తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వర్ష వీళ్ళిద్దరి మీద ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. సీరియస్ వల్ల రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా లభించింది. ఇలా వరుస టీవీ షోలో సందడి చేస్తూ బిజీగా ఉండే వర్ష సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంతోంది.

తాజాగా వర్ష గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన కామెడీ పంచులతో ప్రేక్షకులని నవ్విస్తున్న వర్ష గత కొంతకాలంగా అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న వర్ష తాజాగా జ్వరం ఎక్కువ కావడం వల్ల స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇలా ఆమె అనారోగ్యం క్షమించటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు సమాచారం. వర్ష ని పరీక్షించిన వైద్యులు అధిక జ్వరం ఉండటం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం వర్ష హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్ పై పడుకున్న వర్ష ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.