తండ్రి గుర్తు చేసుకుని ఎమోషన్ అవుతూ కంటతడి పెట్టిన శేఖర్ మాస్టర్.. వీడియో వైరల్!

ప్రస్తుత కాలంలో బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ రియాలిటీ షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రముఖ ఓటీటీ ఛానల్ అయిన ఆహాలో కూడా ఇటీవల డాన్స్ ఐకాన్ అనే డాన్స్ షో ప్రారంభమైంది. ఈ షోలో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరించగా ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆహాలో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షో మంచి ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమోలో ఆసిఫ్ అనే ఒక కంటెస్టెంట్ చేసిన పర్ఫార్మెన్స్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఆశా పాశం బందీ చేసేలే అనే పాటకు ఆసిఫ్ చేసిన పర్ఫార్మెన్స్ చూసి జడ్జిలు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆసిఫ్ తన తండ్రిని కోరిక కోరుతూ మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకోవచ్చా అని అడిగాడు దీంతో ఆశిఫ్ తండ్రి తన కొడుకుని మనసుకి గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆసిఫ్ మాట్లాడుతూ చిన్నప్పటినుండి ఏదైనా పండుగ సందర్భాలలో స్నేహితులను హగ్ చేసుకునే వాడినని కానీ చిన్నప్పటినుండి నాన్నను ఎప్పుడు హగ్ చేసుకోలేదని వెల్లడించాడు.

అలా తండ్రి కొడుకులు మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ చూసి శేఖర్ మాస్టర్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు నేను ఇలా హత్తుకోవడానికి నాకు నాన్న లేడు అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఓంకార్ శేఖర్ మాస్టర్ ని హత్తుకొని మీకు నాన్న లేడు.. నాకు నాన్న లేడు … మీకు నేను నాకు మీరు అంటూ శేఖర్ మాస్టర్ కి ధైర్యం చెప్పాడు. ఈ ఎపిసోడ్లో తండ్రి ఎమోషన్ తో డాన్స్ ఐకాన్ స్టేజ్ మొత్తం ఎమోషన్ తో నిండపోయింది.

Dance IKON Episode 5 & 6 | Promo | Ohmkar | Sekhar Master | ahaVideoIN