గుడిలో జ్ఞానంభకు అవమానం… వడ్డీ వ్యాపారితో గొడవపడిన రామ!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… జ్ఞానంభ మల్లిక కలిసి గుడికి వెళ్తారు. అయితే గుడిలో మల్లిక ప్లాన్ ప్రకారం నీలావతిని రప్పించి లేనిపోని మాటలతో తనని ఇబ్బందులకు గురిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా జ్ఞానంభను తలా ఒక మాట అని అవమానిస్తారు. అయితే అదే గుడిలోనే రామా జానకి ఇద్దరు కూడా క్యాటరింగ్ పనులు చేస్తూ ఉంటారు. సునంద అక్కడికి వచ్చి మీ అత్త నువ్వు కాబోయే ఐపీఎస్ అంటూ గొప్పలు చెబుతుంది కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నావు అంటూ అవమానిస్తుంది.

సునంద ఇలా మాట్లాడేసరికి జానకి నీలాంటి వారి దగ్గర చేయి చాచి అడగడం కన్నా ఇలా పనులు చేసుకోవడమే మంచిది అని కౌంటర్ ఇస్తుంది. ఇక సునంద కూడా లోపలికి వెళ్లడంతో అక్కడ జ్ఞానంభ ఉండటం చూసి నువ్వేమో మీ కోడలు కాబోయే పోలీస్ ఆఫీసర్ అంటున్నావ్ వాళ్ళు చూస్తే ఇదే గుడిలో క్యాటరింగ్ ఇస్తున్నారు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.అప్పుడే రామ అక్కడికి వచ్చి తన తల్లి నిలబడటం చూసి షాక్ అవుతారు. మరొక మహిళ జ్ఞానంభ స్వీట్ షాప్ లో స్వీట్లు తీసుకున్నాం పరమ చెత్తగా ఉన్నాయి అని మాట్లాడటంతో మా షాపులో అలా జరిగే ఛాన్స్ లేదు అని రామా చెబుతాడు.

వెంటనే రామ షాపు వద్దకు వెళ్లగా అక్కడ వడ్డీ వ్యాపారి భాస్కరరావు కూర్చుని ఉంటాడు. ఇదేంటి స్వీట్స్ అన్ని కూడా తక్కువ క్వాలిటీతో చేస్తూ మా షాపుకు చెడ్డ పేరు తీసుకు వస్తున్నారు అని రామా అనడంతో ఇప్పుడు ఇది మీ షాప్ కాదు ఇది నా షాప్ అని భాస్కర్ రావు వాదిస్తాడు.ఇలా కొంతసేపు రామా భాస్కర్ రావు మధ్య గొడవ జరుగుతుంది. నీ షాప్ అయితే నువ్వు వెంటనే డబ్బు చెల్లించి తీసుకో అని భాస్కర్ రావు చెప్పగా వెంటనే జానకి అక్కడికి వచ్చి రామకు సర్ది చెబుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రామా జానకి రావడంతో మల్లికా మరికొన్ని పుల్లలు వేసి వీరి వల్లే ఇలా అవమానం జరిగింది అంటూ తన అత్తయ్యను రెచ్చగొడుతుంది. అంతలోపే జెస్సి వెన్నెల వస్తుందని చెప్పడంతో అందరూ సైలెంట్ అవుతారు.