కుటుంబ విలువలను తెలియజేస్తూ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకి ఎంతో ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ కార్యక్రమంలో ఏం జరిగింది అనే విషయానికి వస్తే జ్ఞానంబ కుటుంబ సభ్యులందరూ కూడా జెస్సి సీమంతానికి ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. అంతలోనే జెస్సీ తండ్రి పీటర్ అక్కడికి రావడంతో అందరూ ఆయనని ఆప్యాయంగా పలకరించారు. ఆయన కూడా మల్లిక దగ్గరికి వెళ్లి జాగ్రత్తలు చెబుతారు. ఇలా సీమంతానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మల్లికకు జాగ్రత్తలు చెప్పి తనని పరామర్శించడంతో మల్లికా చిరాకు పడుతూ ఉంటుంది.
ఇక జెస్సి తల్లి కావడంతో ఆచారం ప్రకారం తన అత్తగారు తనకు ఇచ్చిన నగలు అన్నింటిని జ్ఞానాంబ జెస్సికి ఇస్తుంది.అది చూసిన మల్లికా కుళ్ళుకుంటూ మరి కొద్ది రోజులు ఈ కడుపు నాటకం ఆడి ఆ నగలు అన్నింటిని నా సొంతం చేసుకొని ఉంటే బాగుండేది అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అత్తవారింట్లో తన కూతుర్ని చూసిన జెస్సీ తండ్రి పీటర్ ఎంతో సంతోష పడతారు.ఇలా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా సీమంతం జరుపుకుంటూ ఉండగా డాక్టర్ ఫోన్ చేయడంతో జానకి కంగారు పడుతుంది. జెస్సీ కడుపులో ఉన్న బిడ్డను ఏమాత్రం కాపాడలేమని తనకు బిడ్డ పుట్టడానికి ఒక్క శాతం కూడా అవకాశం లేదని చెప్పడంతో జానకి ఆందోళన చెందుతుంది.
ఇలా జానకి కంగారుపడుతూ ఫోన్ మాట్లాడటం చూసిన మల్లికా జానకి ఎందుకు ఇంత కంగారుపడుతుంది ఇందులో ఏదో ఉంది కనుక్కోవాలని తెగ ఆరాటపడుతుంది.ఇక డాక్టర్ జానకితో మాట్లాడుతూ రిపోర్ట్స్ తన నర్స్ చేత పంపించానని చెప్పడంతో జానకి కంగారుగా ఫోన్ పెట్టేస్తుంది. అంతలోనే నర్స్ వచ్చి రిపోర్ట్స్ జ్ఞానంబ చేతికి ఇస్తుంది. రిపోర్ట్స్ చూసి జెస్సీ కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉందో చెప్పమని నర్స్ నుఅడుగుతుండగా అంతలోపే జానకి అక్కడికి వచ్చి రిపోర్ట్స్ తీసుకుని నర్స్ ను పంపిస్తుంది. ఇక ఆ రిపోర్ట్స్ ఎవరికి కనపడకుండా భద్రంగా దాస్తుంది.
ఇదంతా చూసిన మల్లికా రిపోర్ట్స్ కూడా ఇలా భద్రంగా దాల్చింది అంటే ఏదో జరగకూడనిదే జరుగుతుంది అని ఆలోచిస్తూ ఆ రిపోర్ట్స్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అంతలోనే చికిత తనని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. మరోవైపు సీమంతం గొప్పతనం గురించి జ్ఞానంబ అందరికీ చెబుతుంది.ఇలా అందరూ సంతోషంగా జస్సీకి శ్రీమంతం చేస్తూ ఉండగా రామ తన మనసులో నాకు కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం మీరు కూడా ఇలా వేడుక చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తన మనసులో అనుకుంటారు.