Home TV SHOWS Bigg boss 4: శనివారం నో హోస్ట్.. ఆదివారం సాయంత్రం 6 కే స్టార్ట్.. సమంతకు...

Bigg boss 4: శనివారం నో హోస్ట్.. ఆదివారం సాయంత్రం 6 కే స్టార్ట్.. సమంతకు ఇది చాలెంజింగే?

బిగ్ బాస్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఇక ఈ వారం ఎలాగూ నాగార్జున హోస్ట్ గా రాడని తెలిసిసోయింది కదా. ఆయనెక్కడో షూటింగ్ లో ఫుల్లు బిజీగా ఉన్నారు. దీంతో ఈ వారం హోస్ట్ గా నాగార్జున బదులు వేరే వాళ్లు రాబోతున్నారు. ఇప్పటికే ఈ వారం హోస్ట్ గా సమంత రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు పుకారు ఏమీ కాదు. అవి నిజమే.

Samantha Akkineni To Host Bigg Boss 4 Show This Sunday
samantha akkineni to host bigg boss 4 show this sunday

అవును.. ఈ వారం వచ్చే హోస్ట్ సమంతనే. కానీ.. ఆమె శనివారం ఎపిసోడ్ కు రావట్లేదు. ఈ వీకెండ్ లో ఒకే ఎపిసోడ్ హోస్ట్ తో ఉండనుంది. అది కూడా ఆదివారం సాయంత్రం 6 గంటలకే బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 6 నుంచి 9 వరకు బిగ్ బాస్ ఉంటుందట. అంటే ఏకంగా మూడు గంటల పాటు సమంత హోస్ట్ గా ఈ షో నడవనుంది.

నిజం చెప్పాలంటే ఇది చాలా రిస్కీ. ఎందుకంటే.. ఎప్పుడూ బిగ్ బాస్ షోకు హోస్ట్ చేయని సమంత రావడం రావడమే మూడు గంటల పాటు షోను హోస్ట్ చేయడమనేది నిజంగా అసాధ్యం.

మరి.. సమంత.. దుమ్ముదులిపేస్తుందా? తన సహజమైన నటనతో బిగ్ బాస్ షోను రక్తికట్టిస్తుందా? మామను మించిన కోడలు అవుతుందా? అనేది తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.

Samantha Akkineni To Host Bigg Boss 4 Show This Sunday
samantha akkineni to host bigg boss 4 show this sunday

మరోవైపు ఈసారి కొత్త హోస్ట్ వస్తున్నందున, దసరా పండుగ ఉన్నందున ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. కానీ.. బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా మోనాల్ గజ్జర్ ను భరించడం కష్టంగా మారుతోందట. ఓవైపు బయట సోషల్ మీడియాలో మోనాల్ గజ్జర్ పై, బిగ్ బాస్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు కుమార్ సాయి, దేవి నాగవల్లి ఎలిమినేషన్ కరెక్ట్ గా జరగలేదని.. కావాలనే వాళ్లను బయటికి పంపించారని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక గుజరాతీ అమ్మాయిని టీఆర్పీల కోసం.. ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం.. తక్కువ ఓట్లు వచ్చినా హౌస్ లో ఉంచి.. ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను బయటికి పంపించడం కరెక్ట్ కాదు అంటూ అందరూ బిగ్ బాస్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

చూద్దాం.. ఆదివారం అసలు సమంత ఎలా హోస్ట్ చేస్తుందో? ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఇక శనివారం మాత్రం సాధారణంగా మిగితా రోజుల్లో ప్రసారం అయినట్టుగానే బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

- Advertisement -

Related Posts

భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నేచురల్ స్టార్ !

సినిమా హిట్టా ఫట్టా అని లెక్కలేసుకోకుండా క్రేజ్‌ను బట్టి రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు మన హీరోలు. ఇప్పటికే నాగశౌర్య ఒక్క సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తుండగా తాజాగా నేచురల్ స్టార్  నాని...

ప్రేక్షకుల్ని ఎక్కడ కొట్టాలో ఆ హీరోకు బాగా తెలుసు

విజయ్ దేవరకొండ.. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి సరికొత్త ప్రమోషన్లు, స్ట్రాటజీలతో తనను తాను ప్రేక్షకులకు దగ్గర చేసుకున్నారు. ఆ భిన్నత్వమే అతి తక్కువ కాలంలో అతనికి మాంచి ఫ్యాన్ బేస్ క్రియేట్...

ఉమెన్స్ డే స్పెషల్ .. ‘వ‌కీల్ సాబ్’ కొత్త‌ పోస్టర్ విడుద‌ల !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే...

Latest News