ప్రస్తుతం ఇండస్ట్రీలో జబర్దస్త్ గురించి, శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి కిరాక్ ఆర్పి చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈ వివాదం పై పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన షేకింగ్ శేషు కూడా ఈ వివాదం పై స్పందించాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యు లో పాల్గొన్న శేషు కిర్రాక్ ఆర్పి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్పీ ఒక మోసగాడు అని సినిమా తీస్తా అని చెప్పి తన ఊరి నుండి ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఇంకా సినిమా మొదలు పెట్టకుండానే అతనితో 20 లక్షలు ఖర్చు చేయించాడని శేషు చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా వేరొకరి ఇంటిని తన ఇంటికి చెప్తూ హోం టూర్ వీడియోలూ తీసి బాగా డబ్బు సంపాదించాడని ఆయన వెల్లడించాడు. ఆర్పీ ఒక మూర్ఖుడు. తనకి అన్నం పెట్టిన సంస్థ గురించి ఇలా చెప్పి అన్నం పెట్టిన తల్లి లాంటి జబర్దస్త్ కి అన్యాయం చేసాడు అంటూ శేషు మండిపడ్డారు. అయితే తన గురించి శేషు చేసిన వ్యాఖ్యలపై ఆర్పీ స్పందించాడు. ఈ క్రమంలో ఆర్పి శేషు కుటుంబసభ్యులను కూడా ఈ వివాదంలోకి లాగి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఆర్పీ మాట్లాడుతూ.. కథ నచ్చి ఒక వ్యక్తి సినిమా తీస్తానని ముందుకి వచ్చాడు. నాగబాబు గారు, చక్రవర్తి గారు ఆశీర్వదించి ప్రోత్సహించారు. అయితే అనుకోకుండా సినిమా మధ్యలో ఆగిపోయింది అంటూ చెప్పుకొచాడు.
సినిమా ఓకే అయిన తర్వాతే నేను ఆఫీస్ తీసుకున్నాను.ఆఫీస్ లేకుండా ఎక్కడ కూర్చుని పని చేయాలి? లేదంటే షేకింగ్ శేషు ఇల్లు ఇవ్వమని చెప్పండి. ఆయన భార్యను ఆఫీస్ బాయ్ గా చేయమనండి. వాళ్ళ అమ్మాయిని పాల పాకెట్స్ తెమ్మనండి తప్పేముంది అంటూ శేషు కుటుంబ సభ్యులను కూడ అవమానిస్తూ మాట్లాడాడు. ఈ షేకింగ్ శేషు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఒక తొత్తు. అందుకే అతన్ని అంతగా పొగుడుతూ మాట్లాడుతున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. జబర్దస్త్ లో షేకింగ్ శేషును నేను జస్ట్ రెండు మూడు సార్లు కలిశాను. అతనితో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. అలాంటిది ఆయన ఎవరు నన్ను విమర్శించడానికి అంటూ సీరియస్ అయ్యాడు. మొత్తనికి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి.