జబర్థస్త్ ద్వారా చిన్నవయసులోనే భారీగా సంపాదిస్తున్న రాకెట్ రాఘవ కొడుకు…?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో మల్లెమాలవారు ప్రేక్షకులను అలరించడానికి కమెడియన్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా వాడుకుంటున్నారు. ఇలా ఎంతోమంది జబర్దస్త్ కి చెందిన కమెడియన్ల కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు ఈ కామెడీ షోస్ లో కనిపించి సందడి చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో బుల్లెట్ భాస్కర్ తండ్రి కూడా వరుసగా స్కిట్లు చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

అలాగే జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన రాకెట్ రాఘవ కొడుకు మురారి కూడా అప్పుడప్పుడు ఈ కామెడీ షోలలో కనిపిస్తూ తన పంచులు సెటైర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఎక్కువగా రాఘవ స్కిట్ లో చేసిన మురారి తన తండ్రి మీద వేసే పంచులతో ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. అయితే రాఘవా టీమ్ లో మాత్రమే కాకుండా జబర్థస్త్ లో ఉన్న మిగిలిన టీమ్ లీడర్లు చేసే స్కిట్ లలో కూడా అప్పుడప్పుడు కనిపించి తన పంచులతో బాగా పాపులర్ అయ్యాడు.

ఇక ఇటీవల హైపర్ ఆది చేసిన స్కిట్ లో కూడా కనిపించిన మురారి తన పంచులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అతి చిన్న వయసులోనే జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన మురారి కి మల్లెమాల వారు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జబర్దస్త్ లో పార్టిసిపేట్ చేసినందుకు మురారి కి ఒక ఎపిసోడ్ కి గాను దాదాపు 5వేల రూపాయల వరకు మల్లెమాల వారు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎక్కువ నిడివి ఉన్న పాత్రకి ..లేదంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటే అప్పుడు పదివేల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఇంత చిన్న వయసులోనే మురారి మంచి గుర్తింపు పొందటమే కాకుండా బాగా సంపాదిస్తున్నాడు.