మా అమ్మే తననీ తీసుకెల్లిందేమో.. చనిపోయిన ప్రేయసిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న డాన్సర్?

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న కామెడీ షోలు ద్వారా ప్రేక్షకులను నవ్విస్తున్న కమెడియన్ల జీవితాలలో కూడా గుండెలు బరువెక్కి పోయే బాధ ఉంటుంది. కానీ వారు ఆ బాధలన్నింటినీ మరిచి ప్రేక్షకులను నవ్వించడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే మల్లెమాల వారు మాత్రం ఇటువంటి కమెడియన్ల జీవితాలలో ఉన్న బాధలను కూడా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తుంటారు. ఇలా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షో లలో సందడి చేస్తున్న ఎంతోమంది తమ జీవితంలో ఉన్న బాధని అందరి ముందు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈవారం ప్రసారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా అందరి చేత కన్నీళ్లు కూడా పెట్టించింది. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ఢీ షో ద్వారా డాన్సర్ గా గుర్తింపు పొందిన పండు అప్పుడప్పుడు స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. ఇక ఈ ఎపిసోడ్లో తన పంచులతో అందరిని ఆకట్టుకున్న పండు తన జీవితంలో ఉన్న బాధని కూడా అందరితో పంచుకున్నాడు.

ఈ ఎపిసోడ్ లో పండు తన ప్రేయసిని తలుచుకుని తన మనసులో ఉన్న బాధని బయట పెట్టాడు. తనకు ఊహ తెలియని వయసులోనే అమ్మ చనిపోవడంతో అమ్మ ప్రేమకు దూరం అయ్యాను. ఆ తర్వాత అమ్మలా ప్రేమించిన ఆ అమ్మాయి కూడా దూరం అయిందని పండు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మా అమ్మ కన్నా తను బాగా చూసుకుంటుంది అన్న కోపంతో మా అమ్మే తనని తీసుకెళ్లిందేమో అంటూ ఎమోషనల్ అయ్యాడు. పండు మనసులో ఉన్న బాధ విని అక్కడున్న వారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.