ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో 9 సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. మూడు పూటలా తినటానికి తిండి లేని ఎంతోమంది ఈ షో ద్వారా కమెడియన్లుగా పాపులర్ అయ్యి మంచి గుర్తింపు పొందటమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారు. ఇలా జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా తన కెరీర్ ప్రారంభించి టీం లీడర్ గా ఎదిగిన రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాకింగ్ రాకేష్ ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ లో పిల్లలతో కలిసి స్కిట్లు చేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు.
ఇలా జబర్దస్త్ కమెడియన్ గా ఫేమస్ అయినా రాకింగ్ రాకేష్ కి సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ తనకి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ కి దూరం కాకూడదని వచ్చిన అవకాశాలు అన్నింటిని కూడా వదులుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్ షోలో కూడా ఎన్నోసార్లు అవకాశం వచ్చినా కూడా రాకేష్ వాటిని దూరం చేసుకున్నాడు. ఇలా జబర్దస్త్ ని నమ్ముకొని బ్రతుకుతున్న రాకేష్ కి జబర్దస్త్ యాజమాన్యం వారు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
జబర్దస్త్ లో టీం లీడర్లకి ఉన్న పాపులారిటీని బట్టి వారి రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇలా జబర్దస్త్ లో అత్యధిక రెమ్యునరేషన్ ఆది అందుకోగా.. రాకింగ్ రాకేష్ కి కూడా తన తన పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఒక్కో ఎపిసోడ్ కి 70 నుంచి లక్ష వరకు మల్లెమాల వారి నుంచి అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇలా కేవలం జబర్దస్త్ రెమ్యూనరేషన్ మీద ఆధారపడి బ్రతకకుండా ఇతర ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ రాకేష్ బాగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.