పెళ్లి గురించి పెద్దమ్మతో మాట్లాడుతానన్న రిషి.. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలను అప్పగించిన జగతి..?

రిషి వసుధార బయలుదేరి పానీపూరి తినటానికి ఆగుతారు. అలా పానీపూరి తింటున్న సమయంలో గతంలో కలిసి కొబ్బరి బోండాలు సాగిన సంఘటన వసుధారకు గుర్తుకు వస్తుంది. ఇంతలో కొబ్బరి బొండాలు తాగిన విషయం గుర్తుకు వచ్చిందా అని రిషి అడుగుతాడు. పానీ పూరి తింటూ రిషి వస్తారా సరదాగా మాట్లాడుకోవడం చూసి మీ పెళ్లెప్పుడు అని పానీ పూరి బండి అతను అడుగుతాడు. ఎందుకలా అడిగారు అని అనగా.. తొందర్లో పెళ్లి చేసుకోబోయే వారే ఇలా గొడవ పడకుండా కబుర్లు చెప్పుకుంటారు అంటూ అతను సమాధానం చెప్పాడు. దీంతో మన పెళ్లి గురించి పెద్దమ్మతో మాట్లాడుతాను అని రిషి అనగానే వసుధర బాధగా ఉంటుంది. దీంతో మీ ఊరు, మీ వాళ్ళని గుర్తు చేస్తే నీకు చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. చదువు కోసం పెళ్లి పీటల మీద నుంచి ధైర్యంగా వచ్చేశావు.. అదే ధైర్యంతో మన పెళ్లికి వాళ్లని ఒప్పిస్తావని నాకు నమ్మకం ఉంది అని రిషి అంటాడు.

దీంతో వసుధార మాట్లాడుతూ.. అందరి ఆడపిల్లలకు పుట్టింటి వాళ్ళు అండగా ఉంటారు. కానీ నా విషయంలో మాత్రం మా నాన్న చేసిన తప్పులు గురించి ఒక కూతురుగా నేను చెప్పలేను. ఆయన మంచివాడే కానీ నా చదువు విషయంలో మాత్రం ఆయన చెప్పినది జరగాలని అంటాడు. మా అమ్మ కూడా ఆయనకి ఎదురు చెప్పలేని నిస్సహాయత. మా నాన్న లేని సమయంలో మా అమ్మ నాకు చెప్పిన ధైర్యం వల్లే పెళ్లి పీటల మీద నుండి వచ్చేసాను. మా ఇద్దరూ అక్కల లాగా నా జీవితం కూడా నాశనమై పోకూడదని మా అమ్మ నన్ను ధైర్యం చెప్పి పంపించింది. జగతి మేడం, మీ అండ వల్ల నేను నా చదువు పూర్తి చేయగలిగాను. నాన్నకు భయపడి అక్కడే ఉంటే నా జీవితం అంతటితోనే ముగిసిపోయేది అంటూ వసుధారా బాధపడింది.

ఆ తర్వాత ఇద్దరు కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్ళగా.. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు వసుధారకు అప్పగించాలని జగతి మేడం మెయిల్ చేసినట్లు మినిస్టర్ వారికి తెలియజేశాడు. అయితే ఇంత పెద్ద బాధ్యత తన మాయలేనని వసుధారా భయపడుతు చెబుతుంది. జగతి మేడం గైడెన్స్ లో నువ్వు ఈ పని చేయగలవు అంటూ రిషి వసుధారకు ధైర్యం చెప్పాడు. ఇక ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పగా మహేంద్ర కూడా వస్తారు ధైర్యం చెబుతాడు. దీంతో వసుధార వెంటనే జగదీష్ దగ్గరకు వెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు తాను చేపట్టలేనని కంగారుపడుతుంది. దీంతో జగతి కూడా వసుధారకు ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత ఎప్పుడు మీ మేడం దగ్గరే కాకుండా నాకు కూడా కొంచెం కనిపించొచ్చు కదా అంటూ రిషి వసుధారకు మెసేజ్ చేస్తాడు.