గుప్పెడంత మనసు సీరియల్ విపరీతమైన ఆదరణ సంపాదించుకొని ఎంతో అద్భుతమైన రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా జగతి రిషి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. కేవలం డాడ్ ఆనందం కోసమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చాను మరిన్ని బంధాలను కలుపుకోవాలని కాదు అంటూ మాట్లాడుతారు. డాడ్ మీద ప్రేమతోనే మిమ్మల్ని తీసుకువచ్చాను. మీరు మరే బంధాలను కలుపుకోవాలని ప్రయత్నించకండి కేవలం మీపై గౌరవం మాత్రమే అంటూ రిషి చెబుతాడు.నేను ఈ ఇంటికి మాత్రమే దూరమయ్యాను బంధాలకు కాదు రిషి అని చెప్పడంతో అందుకే కదా మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకు వచ్చాను అని చెబుతాడు.
కొన్ని సంవత్సరాల నుంచి డాడ్ ముఖంలో కరువైన ఆనందం మీరు వచ్చాక కనపడింది ఆ ఆనందం సంతోషం అలాగే ఉండనివ్వండి అని అడుగుతాడు. దీంతో నువ్వు వసుధారా సంతోషంగా అని చెప్పబోతూ ఉండగా వసుధారను మీ మనిషి అని నేను ప్రేమించలేదు తనని తనలాగే ఇష్టపడి ప్రేమించాను అని సమాధానం చెబుతాడు.ఎవరు ఏమన్నా వసుధార చివరి వరకు నాతో కలిసి ప్రయాణం చేస్తుంది. కొందరిల మధ్యలోనే వదిలి బంధాలను తెంచుకోదు అంటూ రిషి మాట్లాడతారు.
దీంతో జగతి ఒక మాట అడగనా రిషి మహేంద్ర అంటే ప్రేమ, నేనంటే గౌరవం అన్నావు అయితే ఎప్పటికీ నేను నీకు మేడంగానే ఉండాలా మేడం అని పిలుపుతోనే సరి పెట్టుకోవాలా నాకు అమ్మ అని పిలిపించుకొని భాగ్యం లేదా చెప్పు రిషి అని అడుగుతూ ఉండగా రిషి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటాడు. అదే సమయంలో వసుధార జ్యూస్ తీసుకొని వచ్చి ఏంటి సైలెంట్ గా ఉన్నారు. అని అడగగా కొన్నిసార్లు మౌనం కూడా సమాధానాలు చెబుతూ ఉంటాయి వసు అని జగతి చెబుతుంది.ఇక రిషి మేడంకి కావాల్సినవన్నీ జాగ్రత్తగా చూసుకో వసుధారా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు గౌతమ్ రిషికి అంకుల్ వాళ్లు నా దగ్గరే ఉన్నారని తెలిస్తే ఇంకేమైనా ఉందా వెంటనే అంకుల్ వాళ్ళ వస్తువులన్నీ కూడా అక్కడికి పంపించాలి అని అనుకుంటాడు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో రిషి అక్కడికి రాగా తాను తర్వాత భోంచేస్తానని తానే స్వయంగా అందరికీ వడ్డిస్తాడు. మరోవైపు జగతి కోసం వసుధార భోజనం తీసుకెళ్లి తినిపిస్తుంది.ఇక నువ్వు కూడా కూర్చో భోజనం చెయ్ రిషి అని చెప్పగా నేను వసుధార కలిసి తర్వాత తింటామని చెబుతాడు. కాసేపటి తర్వాత ఒకసారి బయటికి రాగలవా వసుధార అంటూ తనకు మెసేజ్ చేస్తారు.బయటికి రావడంతో సరదాగా కాసేపు ఎక్కడికైనా బయటకు వెళ్దామా అని ఇద్దరు కలిసి సంతోషంగా బయటకు వెళ్తారు.